చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం కావచ్చు

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం కావచ్చు

Phani CH

|

Updated on: Mar 29, 2024 | 2:06 PM

చెవి నొప్పి.. కంటికి కనిపించకుండా మనిషిని ముప్పుతిప్పలు పెట్టే అనారోగ్య సమస్య.. మీరు తరచుగా చెవి నొప్పి సమస్యతో ఇబ్బంది పడుతున్నారా..? మెడికల్‌ షాపులో లభించే ఏదో ఒక డ్రాప్స్‌ వేసి ఉపశమనం పొందుతున్నారా..? ఇలా చేయటం ప్రమాదం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. తరచూగా వచ్చే చెవి నొప్పిని నిర్లక్ష్యం చేయకూడదని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఇది చాలా తీవ్రమైన వ్యాధులకు కారణం కావచ్చునని చెబుతున్నారు.

చెవి నొప్పి.. కంటికి కనిపించకుండా మనిషిని ముప్పుతిప్పలు పెట్టే అనారోగ్య సమస్య.. మీరు తరచుగా చెవి నొప్పి సమస్యతో ఇబ్బంది పడుతున్నారా..? మెడికల్‌ షాపులో లభించే ఏదో ఒక డ్రాప్స్‌ వేసి ఉపశమనం పొందుతున్నారా..? ఇలా చేయటం ప్రమాదం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. తరచూగా వచ్చే చెవి నొప్పిని నిర్లక్ష్యం చేయకూడదని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఇది చాలా తీవ్రమైన వ్యాధులకు కారణం కావచ్చునని చెబుతున్నారు. చెవి నొప్పిని తేలికగా తీసుకుంటే, అది భవిష్యత్తులో మరింత ప్రమాదకరంగా మారుతుందని చెబుతున్నారు. చెవి నొప్పిని వదిలించుకోవడానికి ప్రజలు తరచుగా ఆయుర్వేదం లేదా, ఏదొక నొప్పి నివారణ మందులు తీసుకుంటారు. వాటివల్ల ఈ నొప్పి నయమవ్వచ్చు.. కాకపోవచ్చు. చెవి నొప్పి ఒకటి రెండు రోజులకంటే ఎక్కువ ఉంటే, దానిని నిర్లక్ష్యం చేయడం సరికాదంటున్నారు. అలాంటప్పుడు వెంటనే వైద్యుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు. చెవి నొప్పి సమస్య ఉన్నప్పుడు నీరు, షాంపూ చెవుల్లోకి వెళ్లకుండా చూసుకోవాలి. దీని వల్ల కూడా చెవి నొప్పి మరింత తీవ్రమవుతుంది. కాబట్టి స్నానం చేసేటప్పుడు చెవ్వుల్లో కాటన్ పెట్టుకోవడం మంచిది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే.. షాక్‌

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు

రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు

మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..

తొలిసారి మిస్ యూనివ‌ర్స్ పోటీల్లో పాల్గొనాల‌ని సౌదీ నిర్ణ‌యం