Cinema Chettu: పడిపోయిన సినిమా చెట్టును చూసి భావోద్వేగానికి గురైన డైరెక్టర్ వంశీ
150 ఏళ్ల చరిత్ర కలిగిన ‘నిద్రగన్నేరు చెట్టు’ ఇటీవల నేలకొరిగిన విషయం తెలిసిందే. సుమారు 300 సినిమాల్లోని పలు సన్నివేశాలు, పాటలను ఇక్కడ చిత్రీకరించారు. తాజాగా నేలకొరిగిపోయిన ఈ సినిమా చెట్టును చూసి ప్రముఖ సినీ దర్శకులు వంశీ బావోద్వేగానికి గురయ్యారు. ఈ చెట్టును మళ్లీ బతికించాలని కోరారు.
పడిపోయిన సినిమా చెట్టును చూసి భావోద్వేగానికి గురయ్యారు డైరెక్టర్ వంశీ. చెట్టుతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వంశీ 22 సినిమాల్లో సుమారు 18 సినిమాల్లో చెట్టు సీన్ పెట్టేవారు.
తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవంలో ఉంటుంది ఈ చెట్టు. మంచుపల్లకి, సితార, లేడీస్ టైలర్, డిటెక్టివ్ నారద, చెట్టు కింద ప్లీడర్, గోపి గోపిక గోదావరి.. ఇలా చెప్పుకుంటూ పోతే వంశీ తీసిన 22 సినిమాల్లో సుమారు 18 సినిమాల్లో కుమార దేవం సినిమా చెట్టు కింద ఏదో ఒక సీన్ ఉండేది. అలాంటి చెట్టు కూలిపోవడంతో భావోద్వేగానికి గురయ్యారు. కూలిన కుమారదేవం సినిమా చెట్టును పరిశీలించి.. చెట్టుతో ఆయనకున్న అనుబంధాన్ని స్థానికులతో నెమరు వేసుకుంటూ భావోద్యోగానికి గురయ్యారు. ఈ చెట్టు వల్ల కుమారదేవం గ్రామానికి ఎంతో కీర్తిప్రతిష్టలు వచ్చాయనీ.. గోదావరి ఒడిన షూటింగ్ చేస్తే కచ్చితంగా ఈ చెట్టు కింద ఏదో ఒక సీన్ షూటింగ్ జరిగేదన్నారు డైరెక్టర్ వంశీ. కూలిపోయిన ఈ చెట్టు వయసు 150 ఏళ్లు ఉంటుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.