సార్వత్రిక ఎన్నికలకు ప్రత్యేక గీతం.. కొత్త ఓటర్లలో ఉత్సాహం.!

సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో కొత్త ఓటర్ల బాధ్యతను గుర్తుచేస్తూ కేంద్రప్రభుత్వం ఒక గీతాన్ని విడుదల చేసింది. "మేరా పెహలా ఓట్‌ దేశ్‌ కే లియే" అనే ఈ గీతం ద్వారా, 18 ఏళ్లు నిండిన ఓటర్లు, తమ ఓటుహక్కు వినియోగించుకోవాలని కేంద్రప్రభుత్వం కోరింది.

Follow us

|

Updated on: Mar 06, 2024 | 1:53 PM

సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో కొత్త ఓటర్ల బాధ్యతను గుర్తుచేస్తూ కేంద్రప్రభుత్వం ఒక గీతాన్ని విడుదల చేసింది. “మేరా పెహలా ఓట్‌ దేశ్‌ కే లియే” అనే ఈ గీతం ద్వారా, 18 ఏళ్లు నిండిన ఓటర్లు, తమ ఓటుహక్కు వినియోగించుకోవాలని కేంద్రప్రభుత్వం కోరింది. ఓటు వేయడం ద్వారా జాతి నిర్మాణంలో పాలుపంచుకోవాలని ఈ గీతాన్ని విడుదల చేసిన కేంద్ర సమాచార, ప్రచార, యువజన సర్వీసుల శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ కోరారు. యువ ఓటర్లు తమ ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకోవడానికి అందరూ చొరవ తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అటు ప్రధాని మోదీ కూడా తన మన్‌కీబాత్‌లో కొత్త ఓటర్లు ఓటేయాలని పిలుపునిచ్చారు.