PM Modi: బరాసత్ వెళ్లే మార్గంలో ప్రధానిపై పూల వర్షం
పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పార్‌గనాస్‌లో ఉన్న బరాసత్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. సందేశ్‌ఖాలీలో జరిగిన ఘటన సిగ్గుచేటు అని పేర్కొన్నారు. సందేశ్‌ఖాలీలో అకృత్యాలకు పాల్పడిన వ్యక్తిని టీఎంసీ రక్షిస్తోందని విమర్శించారు. అయితే బరాసత్‌కు వెళ్లే మార్గంలో ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రధానికి స్వాగతం పలుకుతూ కనిపించారు.
ప్రధాని మోదీ పశ్చిమ బెంగాల్‌లో పర్యటిస్తున్నారు. సందేశ్ ఖాళి లోక్ సభ నియోజకవర్గంలో గల బరాసత్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అయితే ప్రధాని రోడ్డు మార్గంలో బరాసత్‌కు ప్రయాణిస్తుండగా.. ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లకు ఇరువైపులా నిలబడి పూల వర్షం కురిపించారు. 12 కిలోమీటర్ల పొడవునా జనసందోహం కనిపించింది. ప్రజలంతా స్వచ్చదంగా ప్రధాని కోసం వచ్చారని.. ఈ ర్యాలీని పార్టీ ప్రణాళిక చేయలేదని కమలం నేతలు చెబుతున్నారు. తన కోసం వచ్చిన ప్రజలకు అభివాదం చేస్తూ బరాసత్ చేరుకున్నారు ప్రధాని.
ఇక సభలో తృణమూల్ కాంగ్రెస్ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. TMC ప్రభుత్వంలో ఎన్నడూ మహిళలకు భద్రత లేదన్నారు. సందేశ్ ఖాళిలో టీఎంసీ నేత షేక్ షాజహాన్, అతని అనుచరుల ఆగడాలు పెచ్చు మీరి పోయాయని పేర్కొన్నారు. TMCకి తమ నేతల పట్ల పూర్తి నమ్మకం ఉందని, కానీ బెంగాల్ మహిళల పట్ల లేకపోవడం విచారకరమన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..