మహిళలకు గుడ్ న్యూస్.. దిగొచ్చిన బంగారం ధరలు..వీడియో
పసిడి ప్రియులకు ఊరట లభించింది. చాలా రోజులుగా వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు గురువారం కాస్త తగ్గాయి. దాదాపు నెల రోజులుగా బంగారం, వెండి ధరలు వరుసగా పెరుగుతూ పోతూనే ఉన్నాయి. ప్రస్తుతం తులం బంగారం కొనాలంటే సుమారు లక్షా 11 వేల రూపాయలు వెచ్చించాల్సిన పరిస్థితి ఉంది.
సెప్టెంబర్ 17, బుధవారం నాటి ధరలు పరిశీలిస్తే.. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో 24 కేరట్ల బంగారం ధర తులం రూ.1,11,170 రూపాయలుగా ఉంది. 22 కేరట్ల బంగారం ధర తులం రూ.1,01,900 రూపాయలుగా ఉంది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.1,41,000 రూపాయలుగా ఉంది.ముంబైలో 24 కేరట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,11,700 ఉండగా, 22 కేరట్ల 10 గ్రాముల ధర రూ. 1,02,390 ఉంది. చెన్నైలో 24 కేరట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,12,030 ఉండగా, 22 కేరట్ల 10 గ్రాముల ధర రూ. 1,02,690 ఉంది. బెంగళూరులో 24 కేరట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,11,700 ఉండగా, 22 కేరట్ల 10 గ్రాముల ధర రూ. 1,02,390 ఉంది. కోల్‌కతాలో 24 కేరట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,11,940, 22 కేరట్ల10 గ్రాముల ధర రూ.1,02,610 ఉంది. బంగారం, వెండి ధరలు తగ్గుతుండటంతో భవిష్యత్ అవసరాల కోసం వాటిని ఇప్పుడే కొనుగోలు చేయటం మంచిదని నిపుణులు చెబుతున్నారు. పండుగల వేళ డిమాండ్ ఎక్కువ ఉంటుంది గనుక అది రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరో వైపు అందరూ అనుకున్నట్లుగా యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించారు.
మరిన్ని వీడియోల కోసం :
సెలవులొచ్చాయ్..స్కూళ్లకు దసరా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం వీడియో
ఆమె అరుపు విని కాకులే మోసపోయాయిగా..వీడియో
చెదిరిన కల.. అమెరికాలో విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరం వీడియో
ఇందేంట్రా బాబు ఆకాశంలో రెండు చందమామలు.. మీరూ చూడండి మరి !
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!
మెస్సీతో సెల్ఫీ బదులు.. కార్పెట్ ఇంటికి తీసుకెళ్లిన ఫ్యాన్
