AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ గోల్డ్‌ బాండ్‌ కొన్నవారికి పండగే పండగ..వీడియో

ఆ గోల్డ్‌ బాండ్‌ కొన్నవారికి పండగే పండగ..వీడియో

Samatha J
|

Updated on: Sep 17, 2025 | 8:17 PM

Share

సావరిన్‌ గోల్డ్‌ బాండ్స్‌లో పెట్టుబడులు పెట్టినవారికి ఊహించని లాభాలు అందుతున్నాయి. గోల్డ్ బాండ్స్‌పై భారతీయ రిజర్వ్ బ్యాంకు కీలక ప్రకటన చేసింది. సావరిన్ గోల్డ్ బాండ్ 2019-20 సిరీస్- IV.. ప్రీ మెచ్యూర్ రిడెంప్షన్ ప్రైస్ ప్రకటించింది. ఐదేళ్ల క్రితం కొనుగోలు చేసిన ఈ బాండ్లపై ఏకంగా 186 శాతం ప్రతిఫలం వస్తుండటంతో ఇన్వెస్టర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఆర్బీఐ బుధవారం ఒక ప్రకటన చేసింది.

2019-20 ఆర్థిక సంవత్సరానికి చెందిన సావరిన్ గోల్డ్ బాండ్ సిరీస్-IVకు సంబంధించి ప్రీ-మెచ్యూర్ రిడెంప్షన్ ధరను ఆర్బీఐ ఖరారు చేసింది. 2019 సెప్టెంబర్‌లో జారీ చేసిన ఈ బాండ్లను ఇప్పుడు గ్రాముకు రూ. 11,003 చొప్పున వెనక్కి తీసుకుని నగదు పొందవచ్చని తెలిపింది. అప్పట్లో ఈ బాండ్ల ఇష్యూ ధర గ్రాముకు రూ. 3,890గా ఉండగా, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి డిజిటల్ పద్ధతిలో చెల్లించిన వారికి రూ. 50 తగ్గింపుతో రూ. 3,840కే లభించింది. ప్రస్తుత విమోచన ధరతో పోల్చి చూస్తే, డిస్కౌంట్‌తో కొనుగోలు చేసిన వారికి ప్రతి గ్రాముపై ఏకంగా రూ. 7,163 లాభం వచ్చినట్లయింది. అంటే ఐదేళ్లలోనే దాదాపు 186 శాతం ప్రతిఫలం అందుకుంటున్నారు. ఈ భారీ లాభంతో పాటు ఏటా 2.50 శాతం చొప్పున వడ్డీ కూడా అదనంగా లభిస్తుంది. సాధారణంగా గోల్డ్ బాండ్ల కాలపరిమితి 8 సంవత్సరాలుగా ఉంటుంది. అయితే, బాండ్లు జారీ చేసిన ఐదేళ్ల తర్వాత ముందస్తుగా డబ్బులు తీసుకునే వెసులుబాటును ఆర్బీఐ కల్పిస్తోంది. ఈ సిరీస్ బాండ్లను 2019 సెప్టెంబర్ 17న జారీ చేయగా, సరిగ్గా ఐదేళ్లు పూర్తవడంతో 2025 సెప్టెంబర్ 17 నుంచి రిడీమ్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. సెప్టెంబర్ 12, 15, 16 ఇండియన్ బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ ప్రకటించిన బంగారం సగటు ధర ఆధారంగా ఆర్బీఐ ఈ విమోచన ధరను ఖరారు చేసింది.

మరిన్నివీడియోల కోసం :

భయం లేదు.. అప్రమత్తంగా ఉంటే చాలు వీడియో

ఆ మరణాలు బొడ్రాయి వల్లేనా?వీడియో

నన్నే కాటు వేస్తావా.. పామును తాత ఏం చేశాడంటే? వీడియో

జ‌పాన్‌లో ల‌క్షకు చేరిన 100 ఏళ్లు దాటిన వృద్ధుల సంఖ్య వీడియో