AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Banks Holidays: నవంబరులో 12 రోజులు బ్యాంకులు బంద్‌

Banks Holidays: నవంబరులో 12 రోజులు బ్యాంకులు బంద్‌

Phani CH
|

Updated on: Nov 05, 2025 | 5:23 PM

Share

నవంబర్​​ నెలకు సంబంధించిన బ్యాంక్​ సెలవుల జాబితాను ఆర్బీఐ విడుదల చేసింది. దేశంలోని వివిధ బ్యాంకులకు 12 రోజుల పాటు సెలవులు ఉన్నాయి. వీటిలో కొన్ని జాతీయ సెలవులు, మరికొన్ని ప్రాంతీయ సెలవులు ఉన్నాయి. అందువల్ల కస్టమర్లు ఈ సెలవులను దృష్టిలో ఉంచుకుని, తమ అవసరాలకు అనుగుణంగా బ్యాంకింగ్​ కార్యకలాపాలను ప్లాన్​ చేసుకుంటే బెటర్‌.

నవంబర్​ 1 కర్ణాటక రాజ్యోత్సవ సందర్భంగా కర్ణాటకలో, ఇగాస్​-బగ్వాల్ సందర్భంగా ఉత్తరా ఖండ్ ​లోని బ్యాంకులకు నవంబర్‌ 1న సెలవు. నవంబర్​ 2 ఆదివారం. ఇక నవంబర్​ 5 బుధవారం గురునానక్ జయంతి, కార్తిక పూర్ణిమ సందర్భంగా చాలా రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని బ్యాంకులకు సెలవు. నవంబర్​ 7న వంగల పండుగ సందర్భంగా మేఘాలయలో బ్యాంకులకు నవంబర్‌ 7న సెలవు. నవంబర్​ 8న కనకదాస జయంతి, రెండో శనివారం సందర్భంగా కర్ణాటక సహా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు. నవంబర్​ 9 ఆదివారం. నవంబర్​ 11న లహాబ్​ డ్యూచెన్ సందర్భంగా సిక్కింలోని బ్యాంకులకు హాలీ డే. నవంబర్​ 16 ఆదివారం సెలవు. నవంబర్​ 22 నాలుగో శనివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు. నవంబర్​ 23 ఆదివారం సెలవు. నవంబర్​ 25న గురు తేజ్​ బహదూర్​ జీ అమర వీరుల దినోత్సవం సందర్భంగా పంజాబ్​, హరియాణా, చండీగఢ్​లలో బ్యాంకులకు సెలవు. నవంబర్​ 30న ఆదివారం సెలవు. బ్యాంకులకు సెలవులు ఉన్నప్పటికీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్​, మొబైల్ బ్యాంకింగ్ సేవలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయి. అలాగే యూపీఐ, ఏటీఎం సేవలు కూడా ఎప్పటిలానే నడుస్తాయి. సో.. బ్యాంకు​లకు వెళ్లకుండానే మీ ఆర్థిక లావాదేవీలను పూర్తి చేసుకోవచ్చు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అదృష్టం తలుపు తట్టే లోపు.. దురదృష్టం ఆ తలుపులు పగలగొట్టేసింది

Viral Video: అది కాకి కాదు.. నా బిడ్డ.. చికిత్స చేయించిన యూసుఫ్‌

వెరైటీ దొంగ.. బంగారం, డబ్బు ఏదీ ఎత్తుకెళ్లడు కానీ

రైలులో బీభత్సం.. ప్రయాణికులపై కత్తితో దుండగుల దాడి

30 వేల అడుగుల ఎత్తులో విమానం ..ప్రయాణికుడికి గుండెపోటు.. ఏం జరిగిందంటే