అదృష్టం తలుపు తట్టే లోపు.. దురదృష్టం ఆ తలుపులు పగలగొట్టేసింది
మద్యం దుకాణం లక్కీడ్రాలో అదృష్టం వరించిందనుకుంటే అంతలోనే అది దురదృష్టంగా మారి.. ఉద్యోగం నుంచి సస్పెండ్ అయ్యేలా చేసింది. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఈ ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జిల్లా కేంద్రంలోని రాంనగర్ బాలికల ఉన్నత పాఠశాలలో పుష్ప అనే మహిళ పీఈటీగా పనిచేస్తున్నారు.
ఇటీవల తెలంగాణ మద్యం దుకాణాల టెండర్ల లక్కీడ్రాలో ఆమె దరఖాస్తు చేసుకున్నారు. రూ.3లక్షల రుసుము చెల్లించి ధర్మపూర్ వైన్స్ షాప్ నకు అప్లికేషన్ పెట్టుకున్నారు. గత నెల 26వ తేదిన జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో తీసిన లక్కిడ్రాలో పీఈటీ పుష్పకు టెండర్ దక్కింది. అనంతరం వైన్స్ టెండర్ ఖరారు పత్రాలపై అధికారుల సమక్షంలో సంతకాలు సైతం చేసింది. వేలమందిలో అదృష్టం వరించిందని ఆమెతో పాటు కుటుంబం మురిసిపోయింది. సీన్ కట్ చేస్తే ఆమె టెండర్‌లో మద్యం షాపు దక్కించుకోవడం వివాదాస్పదంగా మారింది. దాంతో ఆమె అదృష్టం కాస్తా ఆవిరైపోయింది. విషయమేంటంటే.. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రభుత్వ టెండర్లలో పాల్గొనకూడదు. ఈమె ప్రభుత్వ ఉద్యోగి, పైగా టీచర్ కావడంత కొంతమంది వ్యాపారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కొందరు ఏకంగా విద్యాశాఖ అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదులు సైతం చేశారు. ఇక ఈ వ్యవహారంపై విచారణ చేసిన అధికారులకు షాకింగ్ నిజాలు తెలిసాయి. పీఈటీ పుష్ప లీవ్ పెట్టి మరీ టెండర్లలో పాల్గొన్నట్లు తేలింది. ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండి ఇలాంటి అంశంలో ఇన్వాల్వ్ కావడాన్ని ఉన్నాతాధికారులకు వివరించారు. అయితే రాజకీయ వత్తిడి కారణంగా ఆమె విషయంలో చర్యలు తీసుకునేందుకు ఆలస్యం చేశారని పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపించాయి. స్థానికంగా, సోషల్ మీడియాలో ‘ ఉపాధ్యాయురాలు… మద్యం వ్యాపారం’ అంటూ తెగ వైరల్ అయ్యింది. దీంతో చేసేది లేక పీఈటీ పుష్పపై ఎట్టకేలకు చర్యలకు ఉపక్రమించారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ నిబంధలనకు విరుద్ధంగా టెండర్ లో పాల్గొన్నందుకు ఆమెపై సస్పెన్షన్ వేటు వేశారు. పూర్తిస్థాయి క్రమశిక్షణ చర్యలు తీసుకునే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని వెల్లడించారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి ప్రవీణ్ కుమారు ఉత్తర్వులు జారీ చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Viral Video: అది కాకి కాదు.. నా బిడ్డ.. చికిత్స చేయించిన యూసుఫ్
వెరైటీ దొంగ.. బంగారం, డబ్బు ఏదీ ఎత్తుకెళ్లడు కానీ
రైలులో బీభత్సం.. ప్రయాణికులపై కత్తితో దుండగుల దాడి
30 వేల అడుగుల ఎత్తులో విమానం ..ప్రయాణికుడికి గుండెపోటు.. ఏం జరిగిందంటే
Telangana: సిరిసిల్ల జిల్లా కుర్రాడికి, ఫ్రాన్స్ అమ్మాయికి పెళ్లి
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

