30 వేల అడుగుల ఎత్తులో విమానం ..ప్రయాణికుడికి గుండెపోటు.. ఏం జరిగిందంటే
కేరళకు చెందిన ఇద్దరు మగ నర్సులు ఎయిర్ అరేబియా విమానంలో దుబాయ్‌కి వెళ్తున్నారు. కొచ్చి నుంచి అబుదాబీ వెళ్తున్న వయనాడ్ వాసి అభిజిత్ జీస్, చెంగన్నూర్‌కు చెందిన అజీశ్ నెల్సన్ విమానం టేకాఫ్ తీసుకున్న 20 నిమిషాలకే ఓ ప్రయాణికుడు శ్వాస పీల్చుకునేందుకు తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించారు. వారిద్దరూ ఆయనకు సాయం చేసేందుకు ముందుకువచ్చారు.
రెండు రౌండ్ల సీపీఆర్ చేసారు. సీపీఆర్ తరువాత ఆ ప్రయాణికుడి శ్వాస కుదుటపడింది. విమానంలోనే ఉన్న ఆరిఫ్ అబ్దుల్ ఖాదిర్ అనే వైద్యుడు వారికి సాయంగా వచ్చారు. బాధిత ప్రయాణికుడికి ఐవీ ఫ్లూయిడ్స్ అందించారు. దీంతో, ఆయన నాడి తిరిగి సవ్యంగా కొట్టుకోవడంతోపాటు పరిస్థితి మెరుగైంది. ఈ కథనాన్ని ఖలీజ్ టైమ్స్ ప్రచురించింది. విమానం దిగిన అభిజిత్, అజీశ్ మామూలుగానే తమ విధుల్లో చేరిపోగా, మీడియా ద్వారా విషయం తెలిసిన బాధిత ప్రయాణికుడి కుటుంబీకులు వారికి కృతజ్ఞతలు తెలిపారు. అభిజిత్, అజీశ్ స్పందించి, ఆ రోజేం జరిగిందో వివరించారు. ఆ ప్రయాణికుడు శ్వాస పీల్చుకునేందుకు ఇబ్బంది పడుతుండటం గమనించాం. దగ్గరికెళ్లి పరీక్షించగా, నాడి కొట్టుకుంటున్న జాడలే లేవు. గుండెపోటుకు గురయ్యారనే విషయం అర్థమయింది. అటువంటి సమయాల్లో చేపట్టాల్సిన సీపీఆర్‌కు వెంటనే ఉపక్రమించాం. దీంతో, పరిస్థితి మెరుగైంది అన్నారు. ఇదంతా తమ వృత్తి ధర్మమని చెప్పారు. కాగా, బాధిత ప్రయాణికుడికి ఎయిర్‌పోర్టులో దిగిన వెంటనే సిబ్బంది వైద్య సాయం అందించారు. ప్రస్తుతం కోలుకుంటున్నట్లు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Telangana: సిరిసిల్ల జిల్లా కుర్రాడికి, ఫ్రాన్స్ అమ్మాయికి పెళ్లి
Hyderabad: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు అలర్ట్
కడుపు నింపని పురస్కారాలు నాకెందుకు.. ఓ రచయిత ఆవేదన
Aliens: భూమిపై ఉన్న అణు స్థావరాలపై ఏలియన్స్ నిఘా
విరాట్ కోహ్లీ రెస్టారెంట్.. ప్లేట్ బిర్యానీ రేటెంతో తెలిస్తే షాకే
వామ్మో అంత రేటా..? కేజీ రూ. 83కి చేరిన సన్నబియ్యం..
ఇక మగాళ్లకూ ఫ్రీ బస్సే! రవాణా మంత్రి సంచలన ప్రకటన
కబోర్డ్ ఓపెన్ చేసిన మహిళ.. అందులో ఊహించని సీన్ చూసి హడల్
అర్ధరాత్రి ఉన్నట్టుండి ఇళ్లపై రాళ్ల వర్షం..
భారతీయ భార్యపై అమెరికన్ భర్త ప్రశంసల వర్షం..
చంపాక ఎలా ఏడవాలి అని చాట్‌జీపీటీని అడిగిన ప్రియురాలు
జింక కోసం మాటువేసిన పులి.. నెమలి ఎంట్రీతో..

