Telangana: సిరిసిల్ల జిల్లా కుర్రాడికి, ఫ్రాన్స్ అమ్మాయికి పెళ్లి
సిరిసిల్ల అబ్బాయి, ఫ్రాన్స్ అమ్మాయి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలానికి చెందిన చైతన్య కొన్నేళ్లుగా ఫ్రాన్స్‌లో ఉంటున్నాడు. అక్కడ ఇమెన్ బెన్ నెజ్మ అనే యువతితో అతడికి పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇరుకుటుంబాల పెద్దలు ఒప్పుకోవటంతో వరుడి ఇంట.. హిందూ సంప్రదాయం ప్రకారం వీరి వివాహం వైభవంగా జరిగింది.
వివాహ వేడుకలో అమ్మాయి తల్లిదండ్రులు, బంధువులు హిందూ సంప్రదాయ దుస్తులు ధరించి అందరినీ ఆకట్టుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన బుచ్చగారి రాజు గౌడ్ లక్ష్మీల కుమారుడు చైతన్య ఉన్నత చదువుల కోసం ప్యారిస్ వెళ్లారు. అక్కడే ఉద్యోగం సంపాదించారు. తనతోపాటు పనిచేసే ప్యారిస్ కు చెందిన ఇమేన్ బెన్ నెజ్మ అలియాస్ సాన్వి అనే యువతితో ప్రేమలో పడ్డాడు. ఇద్దరి మనసులు.. ఆలోచనలు కలిశాయి.దీంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇరు కుటుంబాలు కూడా అంగీకారం తెలిపాయి. దీంతో పెళ్లి వేడుక అబ్బాయి స్వగ్రామమైన ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ గ్రామంలో వరుడి ఇంటి వద్ద ఘనంగా జరిగింది. పెళ్లి హిందూ సంప్రదాయాల ప్రకారం వివాహం చేశారు. తెలుగు దనం ఉట్టిపడేలా వధువును.. వరుడి కుటుంబీకులు రెడీ చేశారు. తెలుగు సైతం కొంచెం కొంచెం మాట్లాడుతున్న సాన్వి ఇక్కడి సంప్రదాయం తనకెంతో నచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ పెళ్లి వేడుకకు గ్రామస్తులంతా హాజరై నూతన జంటను దీవించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Hyderabad: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు అలర్ట్
కడుపు నింపని పురస్కారాలు నాకెందుకు.. ఓ రచయిత ఆవేదన
Aliens: భూమిపై ఉన్న అణు స్థావరాలపై ఏలియన్స్ నిఘా
విరాట్ కోహ్లీ రెస్టారెంట్.. ప్లేట్ బిర్యానీ రేటెంతో తెలిస్తే షాకే
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!
దారుణం.. మహిళను చంపి బిర్యానీ వండి..
ప్రాంక్ మెసేజ్‌తో రూ.30 లక్షల గుట్టురట్టు!
పిజ్జా సైజు తగ్గింది.. ఫైన్ పడింది..
ఇండోనేషియా మోడల్ వ్యవసాయంతో ఏలూరు రైతు అద్భుతాలు..
ఉద్యోగం మానేయాలనుకుంటున్నారా? HR మేనేజర్ షాకింగ్ వార్నింగ్!
గోల్కొండలో 400 ఏళ్ల నాటి సమాధుల దగ్గర కలకలం!

