Viral Video: అది కాకి కాదు.. నా బిడ్డ.. చికిత్స చేయించిన యూసుఫ్
తెల్లవారుతూనే కావు కావుమంటూ ఊరందరినీ నిద్రలేపుతుంది కాకి. సూర్యోదయానికి ముందే ఇళ్లముందు చెట్లపై చేరి జనాలు లేచేవరకూ కాకులు గోలగోల చేస్తాయి. వాస్తవానికి కాకులు మనుషులకు ఎంతగానో సహాయపడతాయి. కాకి ఎంతో క్రమశిక్షణ కలిగిన జీవి. ఇది ఏ ఇంటిగుమ్మంలో వాలి అరిచినా ఆ ఇంటికి బంధువులు వస్తారని నమ్ముతారు.
అదొక శుభసూచకంగా భావిస్తారు. అలాంటి ఓ కాకి ఓ పండ్ల వ్యాపారి కుటుంబంతో విడిపోని బంధాన్ని ఏర్పరచుకొంది. అదెలాగో చూద్దాం. నల్లగొండ జిల్లా దేవరకొండ పట్టణంలో షేక్ యూసుఫ్ కుటుంబం పండ్ల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ప్రతిరోజూ ఓ కాకి వారి ఇంటి బయట పడేసిన ఆహార పదార్థాలు, పాడయిన పండ్లను తినేందుకు వచ్చేది. అలా యూసుఫ్ కుటుంబానికి ఆ కాకి దగ్గరైంది. వారి కుటుంబంలో భాగమైపోయింది. ప్రతిరోజు ఉదయం యూసఫ్ ఇంటికి వచ్చి.. సాయంత్రం వరకు అక్కడే ఉంటుంది. సాయంత్రం తిరిగి తన గూటికి వెళ్లిపోతుంది. దీంతో వారు కాకికి పళ్ళు, అన్నం, చికెన్ ఆహారంగా పెట్టేవారు. ఈ క్రమంలో ప్రతిరోజు ఇంటికి వచ్చి ఆహారం పెట్టేవరకూ గోల గోల చేసే కాకి, ఆ రోజు ఎలాంటి ఆహారం ముట్టుకోకపోవడంతో యూసుఫ్‌కు అనుమానం వచ్చింది. కాకికి ఏమైందో అని వారి కుటుంబం కలవరపడింది. రెండురోజులైనా ఆహారం తీసుకోలేదు. దీంతో ఆందోళన చెందినా యూసఫ్ ఆ కాకిని స్థానిక వెటర్నరీ హాస్పిటల్ కు తీసుకువెళ్లాడు. పశు వైద్యుడు పరీక్షించి ఆ కాకికి చికిత్స చేశాడు. తిరిగి కోలుకున్న ఆ కాకి యధావిధిగా ఆహారం తీసుకుంటోంది. దాంతో యూసుఫ్ కుటుంబం ఆనందం వ్యక్తం చేశారు. ఆ కాకితో తమ బంధం ఏనాదితో తెలియదు కానీ దానిని తమ కుటుంబ సభ్యుడిగా భావిస్తున్నామని యూసఫ్ కుటుంబం చెబుతోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వెరైటీ దొంగ.. బంగారం, డబ్బు ఏదీ ఎత్తుకెళ్లడు కానీ
రైలులో బీభత్సం.. ప్రయాణికులపై కత్తితో దుండగుల దాడి
30 వేల అడుగుల ఎత్తులో విమానం ..ప్రయాణికుడికి గుండెపోటు.. ఏం జరిగిందంటే
Telangana: సిరిసిల్ల జిల్లా కుర్రాడికి, ఫ్రాన్స్ అమ్మాయికి పెళ్లి
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

