లోన్ EMI చెల్లిస్తున్నారా? మీకు RBI గుడ్ న్యూస్..!
మీరు ఇంటి లోన్ తీసుకుని EMI చెల్లిస్తున్నారా? వాహనాల రుణాలపై వడ్డీరేట్లు మీకు భారంగా మారాయా? మీలో ఎవరైనా బ్యాంక్ నుంచి అప్పులు తీసుకుని చిన్న పరిశ్రమలు నడుపుతున్నారా? మీ అందరికీ రిజర్వ్‌బ్యాంక్ గుడ్ న్యూస్ చెప్పింది. ఎందుకంటే మీరు ఇప్పటి వరకు చెల్లిస్తున్న వడ్డీరేట్ల భారం కాస్త తగ్గుతుంది. ఎందుకుంటే RBI వడ్డీరేట్లను పావు శాతం తగ్గించింది. అంటే 25 బేసిస్ పాయింట్ల మేర రెపో రేట్ తగ్గుతుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..
అవసరాలకు బ్యాంక్‌ల నుంచి లోన్స్ తీసుకుని ఈఎమ్‌ఐ చెల్లిస్తున్న వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. విశ్లేషకులు అంచనా వేసిన విధంగానే కీలక వడ్డీ రేట్లను తగ్గించింది. దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత మొదటిసారిగా రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఇటీవలి బడ్జెట్ నేపథ్యంలో ఈ ద్రవ్యసమీక్షపై అటు వ్యాపార-పారిశ్రామిక రంగాలు, ఇటు బ్యాంకర్లు-రుణగ్రహీతలు భారీగానే ఆశలు పెట్టుకున్నారు. దీనికి తగ్గట్టుగానే రెపో రేటును పావు శాతం కోత పెట్టింది ఆర్బీఐ. తాజా నిర్ణయంతో ఇప్పటి వరకూ 6.50 శాతంగా ఉన్న రెపో రేటు 6.25 శాతానికి దిగొచ్చింది. అలాగే రెండేళ్ల తర్వాత వడ్డీ రేట్లను సవరించడం ఇదే తొలిసారి కావడం విశేషం. రెపో రేట్ అంటే రిజర్వ్‌బ్యాంక్ దగ్గర బ్యాంకులు తీసుకునే స్వల్పకాలిక రుణాలపై వడ్డీరేటు అని అర్థం. ఈ వడ్డీరేటు తగ్గితే, ప్రజలకు ఊరట లభిస్తుంది. వారి రుణాలపై వడ్డీభారం తగ్గుతుంది. మానిటరీ పాలసీ కమిటీ 5-1 తేడాతో ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. గత 11 సమావేశాల్లో మానిటరీ పాలసీ కమిటీ రెపోరేట్‌లను తగ్గించలేదు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
69 ఏళ్ల వయసులో ఈ పనేంటి స్టార్ సింగర్ ?? నెట్టింట హాట్ టాపిక్
చిన్న మామ ఇలాకాలో.. ఉపాసన గొప్ప కార్యక్రమం
Pawan Kalyan: ఆ విషయంలో ఫ్యాన్స్ మాటను పవన్ వింటారా ??
టికెట్ల పంచాయతీ.. తెలంగాణలో ఇలా.. ఆంధ్రాలో అలా..!
రూ.100 కోట్లు నష్టం.. పైగా జైలు శిక్ష !! ఇదీ.. టాలీవుడ్ ప్రొడ్యూసర్ దీన గాథ
బిచ్చగాడి ఆస్తి చూసి అంతా షాక్ !! ఇనప్పెట్టె తీస్తే నోట్ల కట్టలు
ఏ బిడ్డా.. ఇది నా అడ్డా.. కవ్వాల్ అభయారణ్యంలో అడవి దున్న
ప్రపంచ రికార్డు సృష్టించిన అత్యంత పెద్ద నత్త ను చూసారా ??
అసలు ఆమె తల్లేనా ?? తాగిన మత్తులో 12 ఏళ్ల కొడుక్కి వింత శిక్ష
నగరాభివృద్ధికి 21 కేజీల బంగారాన్ని విరాళంగా ఇచ్చిన దాత
గోమాత మాతృ హృదయం.. మేకపిల్ల ఆకలి తీర్చి..
మంత్రగత్తె అనుమానంతో.. మహిళకు నిప్పంటించిన మూక

