టికెట్ల పంచాయతీ.. తెలంగాణలో ఇలా.. ఆంధ్రాలో అలా..!
ఒకప్పుడు పెద్ద సినిమాలు విడుదలైతే ఎలా ఉండేది..? హీరో ఎలా చేసాడు.. దర్శకుడు బాగా తీసాడా లేదా అని అడిగేవాళ్లు. కానీ ఇప్పుడలా కాదు. ఓ స్టార్ హీరో సినిమా వస్తుంటే టికెట్ రేట్లు ఎంత పెంచారు..? ఒక్కో టికెట్‌పై ఏ రేంజ్ హైక్ ఇచ్చారు అని అడుగుతున్నారు. ఫ్యాన్స్‌తో పాటు కామన్ ఆడియన్స్ కూడా టికెట్ రేట్లకు అలవాటు పడిపోయారు.. కాదు కాదు.. అలా పడేలా చేసారు మన దర్శక నిర్మాతలు.
తాజాగా తండేల్ సినిమాకు ఇదే జరిగింది. నెట్టింట చిన్న పాటి డిస్కషన్ మొదలైంది. పెద్ద సినిమాలు విడుదలవుతున్నాయంటే చాలు.. నిన్నమొన్నటి వరకు రెండు తెలుగు ప్రభుత్వాలు నిర్మాతలకు తీపికబురు చెప్పేవి.. కానీ ఇప్పుడు ఆ రెండింట్లో తెలంగాణ లేదు. ఎందుకంటే పుష్ప 2 సంధ్య థియేటర్ ఘటన తర్వాత పరిస్థితులన్నీ చాలా వేగంగా మారిపోయాయి. దానికితోడు ఇండస్ట్రీలో మారిన సిచ్యువేషన్స్ దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం సినిమాల టికెట్ హైక్స్‌కు నో చెప్పింది.. దాంతో పాటు నో అడిషినల్ షోస్ అంటూ కోర్టు తీర్పిచ్చింది. ఇక మరోవైపు ఏపీ సర్కార్ మాత్రం సినిమాలపై వరాల జల్లు కురిపిస్తూనే ఉంది. టికెట్ రేట్లు భారీగా పెంచుకునే వెసలుబాటు కల్పిస్తుంది. తాజాగా తండేల్‌కు కూడా సింగిల్ స్క్రీన్ 50 రూపాయలు.. మల్టీప్లెక్స్‌లో 75 రూపాయలు పెంచుకునే వెసలుబాటు కల్పించింది. వారం రోజుల పాటు ఈ రేట్లు అందుబాటులో ఉంటాయి. కానీ తెలంగాణలో మాత్రం అలాంటి వెసలుబాట్లేవీ లేవు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రూ.100 కోట్లు నష్టం.. పైగా జైలు శిక్ష !! ఇదీ.. టాలీవుడ్ ప్రొడ్యూసర్ దీన గాథ
TOP 9 ET News: గొప్ప తండ్రిగా అందరి మనసూ గెలిచిన చరణ్
ఒంటరితనంతో బాధపడుతున్నారా ?? ఇది మీ కోసమే
జపనీయులు అంత నాజూకుగా ఉండటానికి కారణమేంటో తెలుసా ??
కారును రైల్వే ప్లాట్‌ఫామ్‌పైకి పోనిచ్చి.. ఆ పై పట్టాల మీద పడి.. సీన్ కట్ చేస్తే

ఆదమరిచి నిద్రపోతున్న శునకం.. మేక ఏం చేసిందో చూడండి

ఎండ వేడి తట్టుకోలేక ఏసీ ఆన్ చేస్తున్నారా.. అయితే జర జాగ్రత్త

మంచినీళ్లు అడిగి.. బంగారం దోచుకెళ్లాడు వీడియో

పిచ్చి పీక్స్‌కి.. వీడియో చూస్తే వణుకొస్తుంది

ఒక్క టూత్ బ్రష్‌తో దుమ్ము దులిపేసిందిగా..వీడియో

పెంపుడు కుక్కలను కిడ్నాప్ చేసి.. రూ.10 కోట్లు డిమాండ్ .. చివరికి

ఏసీ కోచ్‌ల్ ప్రయాణిస్తున్న వ్యక్తి.. పడుకుందామని రెడీ అవుతుండగా..
