Pawan Kalyan: ఆ విషయంలో ఫ్యాన్స్ మాటను పవన్ వింటారా ??
పవన్ కళ్యాణ్‌తో సినిమా అంటే ఎలా ఉంటుందో నిర్మాతలకు బాగా తెలుసు. ఆయన రాజకీయాల్లో ఉండడం, పైగా అధికారంలో ఉండడంతో షెడ్యూల్ టైట్ గా ఉంటుంది. అన్నీ తెలిసే ఆయనతో సినిమాలు చేయడానికి కమిటయ్యారు.. అడ్వాన్సులు కూడా ఇచ్చారు. ఇప్పుడాయన డిప్యూటీ సిఎం.. కొన్ని శాఖలు ఆయన చేతిలో ఉన్నాయి.
ఇలాంటి సమయంలో పవన్ నుంచి సినిమాలు ఆశించడం అనేది అత్యాశే అవుతుంది. అయితే ఆయన ఒప్పుకున్న సినిమాల్లో దాదాపు అన్నీ చివరి దశకు వచ్చేయడం ఒక్కటే కాస్త ఊరటనిచ్చే విషయం. అందుకే మిగిలిన సినిమాలను కూడా పూర్తి చేస్తే అయిపోతుంది కదా అనేది దర్శక నిర్మాతల భావన. అయితే ఫ్యాన్స్ నుంచి మాత్రం పవన్‌కు కొన్ని విన్నపాలు వస్తున్నాయి.. వాటిని ఎంతవరకు ఆయన తీసుకుంటారనేది చూడాలి. తాను డేట్స్ ఇచ్చినపుడు దర్శక నిర్మాతలు యూజ్ చేసుకోలేదు అనేది పవన్ చెప్తున్న మాట.. కానీ ఫ్యాన్స్ మాత్రం ఆ డేట్స్ ఏవో ఇంకొక్కసారి ఇవ్వండి అన్నయ్యా.. ఈసారి పక్కా పూర్తి చేస్తారు.. మాది హామీ అంటున్నారు. పవన్ చేతిలో ప్రస్తుతం 3 సినిమాలున్నాయి. అందులో 2 దాదాపు పూర్తయ్యాయి. ఒకటి మాత్రం 10 శాతం మాత్రమే పూర్తైంది. మూడోది పక్కనబెట్టినా పర్లేదు కానీ ముందు అయితే ఆ రెండు సినిమాల్ని పూర్తిచేయాలని కోరుతున్నారు ఫ్యాన్స్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
టికెట్ల పంచాయతీ.. తెలంగాణలో ఇలా.. ఆంధ్రాలో అలా..!
రూ.100 కోట్లు నష్టం.. పైగా జైలు శిక్ష !! ఇదీ.. టాలీవుడ్ ప్రొడ్యూసర్ దీన గాథ
TOP 9 ET News: గొప్ప తండ్రిగా అందరి మనసూ గెలిచిన చరణ్
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

