Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రూ.100 కోట్లు నష్టం.. పైగా జైలు శిక్ష !! ఇదీ.. టాలీవుడ్ ప్రొడ్యూసర్ దీన గాథ

రూ.100 కోట్లు నష్టం.. పైగా జైలు శిక్ష !! ఇదీ.. టాలీవుడ్ ప్రొడ్యూసర్ దీన గాథ

Phani CH

|

Updated on: Feb 07, 2025 | 11:06 AM

సింగనమల రమేష్.. ఈ పేరు కొన్నేళ్లుగా వినిపించట్లేదు కానీ ఒకప్పుడు టాలీవుడ్‌లో బాగా పాపులర్. పవన్ కళ్యాణ్‌తో కొమురం పులి, మహేష్ బాబుతో ఖలేజా లాంటి భారీ సినిమాలు నిర్మించారీయన. సినీ రంగంలో 100 కోట్లకు పైగా నష్టపోయారుడు. అలాంటి నిర్మాత 14 ఏళ్లుగా మాయమయ్యారు. సడన్‌గా ఇప్పుడు మీడియా ముందుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. తనపై తప్పుడు కేసులు పెట్టారంటున్నారు.

ఇంతకీ ఈయనపై ఉన్న కేసులేంటి..? ఆయన కథేంటి! సింగ‌న‌మ‌ల ర‌మేష్.. 15 ఏళ్ళ కింద ఈ పేరు తెలుగు ఇండస్ట్రీలో బాగా సౌండ్ చేసింది. మ‌హేష్‌, ప‌వ‌న్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేయడమే కాదు.. చాలా పెద్ద సినిమాలకు ఈయన ఫైనాన్షియర్ కూడా. ఎన్నో సినిమాలను వెనకుండి నడిపించాడు. దాంతో అప్పట్లో సింగ‌న‌మ‌ల పేరు మార్మోగింది. ఖలేజా విడుదల తర్వాత ఉన్నట్లుండి ఈయన కామ్ అయిపోయారు.. కనిపించకుండా పోయారు.. ఇంకా చెప్పాలంటే అసలు ఈయనెక్కడున్నారో కూడా ఎవరికీ ఐడియా లేదు. దానికి కారణం ఆయన జైలు పాలవ్వడం, ఆయనపై ఛీటింగ్ కేసులు నమోదవ్వడమే. ఇక 2011లో గచ్చిబౌలిలోని ఓ వ్యాపారి దగ్గర 12 కోట్లు తీసుకుని మోసం చేసారని ఈయనపై ఛీటింగ్ కేసు నమోదైంది. అంతేకాదు.. ఒకే భూమిని చాలా మందికి అమ్మారనే అభియోగాలు కూడా రమేష్ బాబుపై ఉన్నాయి. ఈ కేసులో 78 రోజులు జైల్లో ఉన్నారు ఈ నిర్మాత. అయితే ఈ కేసులో సరైన సాక్ష్యాలు లేవని జనవరి 31, 2025న రమేష్ బాబును నిర్ధోషిగా విడుదల చేసింది కోర్టు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET News: గొప్ప తండ్రిగా అందరి మనసూ గెలిచిన చరణ్‌

ఒంటరితనంతో బాధపడుతున్నారా ?? ఇది మీ కోసమే

జపనీయులు అంత నాజూకుగా ఉండటానికి కారణమేంటో తెలుసా ??

కారును రైల్వే ప్లాట్‌ఫామ్‌పైకి పోనిచ్చి.. ఆ పై పట్టాల మీద పడి.. సీన్ కట్ చేస్తే