Tunnel Rescue: సొరంగంలో కార్మికులు బయటపడేదెట్టా.? 11రోజులుగా సొరంగంలో 41మంది కూలీలు.
ఉత్తరాఖండ్‌లోని సిల్క్యారాలో నిర్మాణంలో ఉన్న సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను బయటకు తీసుకువచ్చే ప్రయత్నాలు చివరి దశకు చేరాయి.నిన్న సాయంత్రానికి అందర్నీ రక్షిస్తామని అధికారులు ప్రకటించారు కాని.. అది కుదరలేదు.. తవ్వకాల సమయంలో శిథిలాలు అడ్డు రావడంతో సహాయక చర్యలకు ఆటకం ఏర్పడింది. అయితే చిన్న సొరంగాన్ని డ్రిల్ చేస్తున్న సమయంలో.. మిషనరీ ఓ ఇనుమ మెష్‌లోకి దూసుకెళ్లింది.
ఉత్తరాఖండ్‌లోని సిల్క్యారాలో నిర్మాణంలో ఉన్న సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను బయటకు తీసుకువచ్చే ప్రయత్నాలు చివరి దశకు చేరాయి.నిన్న సాయంత్రానికి అందర్నీ రక్షిస్తామని అధికారులు ప్రకటించారు కాని.. అది కుదరలేదు.. తవ్వకాల సమయంలో శిథిలాలు అడ్డు రావడంతో సహాయక చర్యలకు ఆటకం ఏర్పడింది. అయితే చిన్న సొరంగాన్ని డ్రిల్ చేస్తున్న సమయంలో.. మిషనరీ ఓ ఇనుమ మెష్‌లోకి దూసుకెళ్లింది. నిజానికి ఈ ఐరన్ లాటిస్ గిర్డర్‌ని డ్రిల్లింగ్ మెషీన్ల ద్వారా తీయాలని చూస్తే.. పెను ప్రమాదం తప్పదు. ఇప్పుడు రక్షించే పనులకు తోడు.. మరింత ప్రమాదంలోకి కార్మికులను నెట్టే అవకాశాలుండడంతో.. అక్కడితో రెస్క్యూ పనులను ఆపేశారు. కార్మికులను రక్షించేందుకు ఈ రెండు వారాల్లో 47 మీటర్ల దూరం తవ్వారు అధికారులు. ఇంకా పదిమీటర్ల మేర తవ్వాల్సిఉంది. ఈనేపథ్యంలో పనులకు మరోసారి ఆటంకం కలగడం.. ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే చిన్న సొరంగం ద్వారా కార్మికులకు మంచినీరు.. ఆహారాన్ని పంపుతున్నారు. ఈరోజు ఆ 22 టన్నుల భారీ డ్రిల్లింగ్ యంత్రం బాగైతే.. తిరిగి పనులు ప్రారంభించే అవకాశాలున్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.