D-mart: డీమార్ట్‌కి వెళ్లిన యువతికి ఎదురైన అవమానవీయ ఘటన.. ఏం జరిగిందంటే
ఉత్తరప్రదేశ్ గజియాబాద్‌లోని ఓ డిమార్టులో అవమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఓ యువతి డిమార్ట్‌లోకి వెళ్లగా తన ట్రోలీ ఇతరుల ట్రోలీని ఢీకొనండతో వాళ్లు ఆమెపై దాడి చేశారు. వివరాల్లోకి వెళ్తే గజియాబాద్‌లోని ఓ యువతి తన స్నేహితురాలితో కలిసి ఉంటూ ఓ ఇంజనీరింగ్ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తోంది.
ఉత్తరప్రదేశ్ గజియాబాద్‌లోని ఓ డిమార్టులో అవమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఓ యువతి డిమార్ట్‌లోకి వెళ్లగా తన ట్రోలీ ఇతరుల ట్రోలీని ఢీకొనండతో వాళ్లు ఆమెపై దాడి చేశారు. వివరాల్లోకి వెళ్తే గజియాబాద్‌లోని ఓ యువతి తన స్నేహితురాలితో కలిసి ఉంటూ ఓ ఇంజనీరింగ్ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తోంది. అయితే కొన్నిరోజుల క్రితం ఆమె సరకులు తెచ్చుకునేందుకు వాళ్లిద్దరు డీమార్ట్‌కు వెళ్లారు. అయితే ఆ యువతి తన ట్రోలీలో వస్తువులు వేసుకుంటుండగా పొరపాటున అది వేరే వాళ్ల ట్రోలీని ఢీకొట్టింది. దీంతో ఓ మహిళ, ఇద్దరు మగవాళ్లు ఆమెతో అనుచితంగా ప్రవర్తించారు. దీంతో ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది.
తను వాళ్లకు క్షమాపణలు చెప్పినప్పటికీ కూడా వాళ్లు ఆమెను కొట్టారని.. చొక్కా పట్టుకుని లాగారని పోలీసుల ముందు వాపోయింది. కానీ మొదట పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు ఒప్పుకోలేదు. ఆ తర్వాత సినియార్ అధికారులు జోక్యం చేసుకోవడంతో కేసు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం దీనిపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..