Viral Video: గంగో రేణుక తల్లి.. ఆ నీటి మడుగులో ఏముందో తెలిస్తే మీ గుండెలు గుభేల్
సరీసృపాలలో అనకొండ చాలా పెద్ద పాము. కాయంలోనే కాదు పొడవులోనూ చాలా భారీగా ఉంటుంది. సామాజిక మాధ్యమాల్లో అనకొండకు సంబంధించిన వీడియోలు చాలానే ఉన్నాయి. ఇటీవలే నెట్టింట వైరల్ అవుతున్న వీడియో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే ఈ వీడియో ఇంతలా వైరల్ అవ్వడానికి గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా పాములు గుడ్లు, పక్షులు, కప్పలు, ఎలుకలను మింగడం చూసే ఉంటారు. కానీ పాముల్లో పెద్ద పాములుగా పేరున్న అనకొండ, కొండచిలువలు ఏకంగా పెద్ద పెద్ద జంతువులను సైతం తినేంత పెద్దవిగా ఉంటాయనే సంగతి తెలిసిందే. కుందేళ్లు, నక్కలు, కోతులు, కొండముచ్చుల సైజ్ ఉండే జంతువులను కూడా సునాయసంగా తినేస్తుంటాయి. అలాంటి వీడియోలు నిత్యం యూట్యూబ్‌లో, సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే అనకొండభారీ కాయంతో పొడవైన పాముగా పేరుగాంచిందని మీకు తెలుసు.
కానీ ఇదిగో ఇప్పుడు ఇక్కడ మీరు చూడబోయే అనకొండ వీడియోను మాత్రం ఇంతకు ముందెప్పుడూ చూసి ఉండరు. ఇందుకంటే.. నీటిలో చాలా పెద్దదైన ఆనకొండ సేదతీరడం ఈ వీడియోలో కనిపించింది. అవును.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియోలో ఓ భారీ అనకొండ కనిపించింది. ఓ చిన్న నీటి మడుగులో దాన్ని స్థానికులు గుర్తించారు. వారిని చూసి అది అక్కడి నుంచి పక్కకు వెళ్లిపోయింది. దాదాపు 20 అడుగులు పైనే ఆ అనకొండ ఉండొచ్చని వీడియోను బట్టి అర్థం అవుతుంది. దీన్ని చూసిన నెటిజన్స్ షాకవుతున్నారు. ఇంత పెద్ద పామును తామెప్పుడు చూడలేదని కామెంట్స్ పెడుతున్నారు. ‘చంద్రముఖి సినిమాలో ఉన్న పాము కంటే పెద్దగా ఉంది’ అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. లేట్ ఎందుకు వీడియోపై మీరూ ఓ లుక్కేయండి. కాగా ఈ వీడియో ప్రామాణికతను టీవీ9 ధృవీకరించడం లేదు.
View this post on Instagram
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..