AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ప్రాణాలు కాపాడుతాడనుకున్నారు.. కట్‌ చేస్తే.. ప్రాణాల మీదకే తెచ్చాడు!

రాజస్థాన్‌లోని జోథ్‌పూర్‌లో ఓ ఆశ్చర్యకరమైన ఘటన జరిగింది. నలుగురు పేషెంట్లతో వేగంగా దూసుకొచ్చిన ఓ అంబులెన్స్‌ ప్రమాదవశాత్తు హాస్పిటల్‌ ఎంట్రెన్స్‌లో ఉన్న గ్లాస్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో అప్పటికే రోడ్డు ప్రమాదంలో గాయాలపై అంబులెన్స్‌లో ఉన్న పేషెంట్స్‌ మరోసారి తీవ్రంగా గాయపడ్డారు. అయితే ప్రమాదంలో ఎలువంటి ప్రాణనష్టం జరగలేదు.

Viral Video: ప్రాణాలు కాపాడుతాడనుకున్నారు.. కట్‌ చేస్తే.. ప్రాణాల మీదకే తెచ్చాడు!
Rajasthan Incident
Follow us
Anand T

|

Updated on: Apr 13, 2025 | 3:58 PM

పోలీసుల వివరాల ప్రకారం..

బలోత్రా సమీపంలోని జాతీయ రహదారి 25పై  పోలీస్ వాహనం, ఓ కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ASP అరవింద్ విష్ణోయ్, ASI హుకమ్ సింగ్, కానిస్టేబుల్ అనిల్ చౌదరి, డ్రైవర్ కానిస్టేబుల్ దిలీప్ మేఘ్వాల్ సహా పోలీసు అధికారులకు గాయాలయ్యాయి. దీంతో వారిని సమీపంలోని ఓ హాస్పిటల్‌కు తరలించారు. అయితే అక్కడ వారిని పరీక్షించిన వైద్యులు జోధ్‌పూర్‌లోని MDM హాస్పిటల్‌కు రెఫర్ చేశారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉండడంతో గ్రీన్‌ ఛానల్‌ ఏర్పాటు చేసి పోలీసులు వారిని అంబులెన్స్‌ సహాయంతో జోధ్‌పూర్‌కు తరలించారు.

ఈ క్రమంలో MDM ఆసుపత్రి వద్దకు చేరుకోగానే నియంత్రణ కోల్పోయిన అంబులెన్స్‌ డ్రైవర్‌ హాస్పిటల్‌ ట్రామా వార్డు ఎంట్రెన్స్‌ను ఢీకొట్టాడు. అయితే అంబులెన్స్‌లో వస్తున్న పేషెంట్స్‌ను రిసీవ్‌ చేసునేందుకు అక్కడే ఉన్న పోలీసులు వెంటనే అప్రమత్తమై వారిని ఎమర్జెన్సీ వార్డుకు తరలించి ట్రీట్‌మెంట్‌ ఇప్పించారు. రెండో సారి జరిగిన ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.