లేటు వయసులో ఘాటు ప్రేమ.. 96 ఏళ్ల ప్రేయసిని పెళ్లి చేసుకున్న 100 ఏళ్ల వ్యక్తీ..

రెండవ ప్రపంచ యుద్ధంలో పనిచేసిన 100 ఏళ్ల రోల్డ్ టెరెన్స్ శనివారం ఫ్రాన్స్‌లోని నార్మాండీలోని డి-డే బీచ్‌లో తన స్నేహితురాలైన 96 ఏళ్ల స్వెర్లిన్‌ను వివాహం చేసుకున్నాడు. వీరిద్దరి వయస్సు కలిపితే వారి వయసు దాదాపు రెండు శతాబ్దాలు.. లేటు వయసులో పెళ్లి చేసుకున్న రోల్డ్ టెరెన్స్, జీన్ స్వెర్లిన్ ల పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

లేటు వయసులో ఘాటు ప్రేమ.. 96 ఏళ్ల ప్రేయసిని పెళ్లి చేసుకున్న 100 ఏళ్ల వ్యక్తీ..
D Day Veteran Couple
Follow us
Surya Kala

|

Updated on: Jun 11, 2024 | 6:33 PM

ప్రేమకు వయసు, ఆస్థి, అంతస్తులు, కులం మతంతో పని లేదన్న సామెత నిజమని మరోసారి అమెరికన్ జంట రోల్డ్ టెరెన్స్, అతని స్నేహితురాలు జీన్ స్వెర్లిన్ నిరూపించారు. రెండవ ప్రపంచ యుద్ధంలో పనిచేసిన 100 ఏళ్ల రోల్డ్ టెరెన్స్ శనివారం ఫ్రాన్స్‌లోని నార్మాండీలోని డి-డే బీచ్‌లో తన స్నేహితురాలైన 96 ఏళ్ల స్వెర్లిన్‌ను వివాహం చేసుకున్నాడు. వీరిద్దరి వయస్సు కలిపితే వారి వయసు దాదాపు రెండు శతాబ్దాలు.. లేటు వయసులో పెళ్లి చేసుకున్న రోల్డ్ టెరెన్స్, జీన్ స్వెర్లిన్ ల పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

పెళ్లికి బయలుదేరిన సమయంలో వధువు జీన్ స్వెర్లిన్ మాట్లాడుతూ “ప్రేమ అనేది యువతకు చెందినది మాత్రమే కాదని చెప్పారు. తాము ఒకరినొకరు చూడటం ద్వారా ఎంతో ఆనందాన్ని పొందుతాము.. మా అలవాట్లు కూడా ఒకదానికొకటి సరిపోతాయని చెప్పింది. అంతేకాదు పెళ్లి తర్వాత టెరెన్స్ మాట్లాడుతూ.. ఇది తన జీవితంలో బెస్ట్ డే అని చెప్పింది.

ఇవి కూడా చదవండి

మాయాబ్ నుంచి శుభాకాంక్షలు

సైన్యాలు దిగిన చోటే పెళ్లి జరిగింది.

రెండవ ప్రపంచ యుద్ధం సందర్భంగా ఫ్రాన్స్‌లోని నార్మాండీలోని డి-డే బీచ్ చాలా ముఖ్యమైనది. జూన్ 6, 1944 న, జర్మన్లతో పోరాడుతున్న మిత్రరాజ్యాల దళాలు ఈ తీరంలో అడుగుపెట్టాయి. ఆ తర్వాత భీకర యుద్ధం ప్రారంభమైంది. ఈ పోరాటం అడాల్ఫ్ హిట్లర్ దౌర్జన్యం నుంచి ప్రాన్స్ ప్రజలను విడిపించింది. ఈ యుద్ధానికి 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా టెరెన్స్, స్వెర్లిన్ వివాహం చేసుకున్నారు. ఈ జంట రాక్ స్టార్‌ల వలె దుస్తులు ధరించారు. గ్లెన్ మిల్లర్ ఇతర పీరియడ్ ట్యూన్‌లు వీధులలో ఈ జంట పెళ్ళికి వేడుకగా వెళ్తున్నారు. వేడుకకు హాజరైన ప్రజలు రెండవ ప్రపంచ యుద్ధ కాలం నాటి దుస్తులను కూడా ధరించారు.

ఉంగరం పెట్టి పెళ్లి చేసుకున్న

తన 96 ఏళ్ల స్నేహితురాలికి ఉంగరాన్ని తోడుగుతూ ‘ఈ ఉంగరం పెట్టి.. నేను నిన్ను పెళ్లి చేసుకుంటున్నా అని టెరెన్స్ చెప్పాడు. రోల్డ్ టెరెన్స్ చెప్పిన విధానానికి స్వెర్లిన్ ఆశ్చర్యపడుతూ నవ్వుతూ.. “నిజంగానా?” అని అంటూ పెళ్ళికి తన సమ్మతం తెలియజేసింది. పెళ్లి వేడుక ముగిసిన తర్వాత దంపతులు ఇద్దరూ తమ చేతుల్లో షాంపైన్ బాటిల్ పట్టుకుని, బయట నిలబడి ఉన్న అభిమానుల గుంపు వైపు తెరిచిన కిటికీ గుండా ఊపారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం