Worlds Smallest Buffalo : ప్రపంచంలో అతి చిన్న గేదె ఇదే.. ఎత్తు ఎంతో తెలిస్తే అవాక్కే..!
ప్రపంచంలోనే అతి చిన్న గేదె గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకుంది. అంతేకాదు.. ఇప్పుడు ఆ గేదె యావత్ దేశానికి కొత్త అభిమాన తారగా మారింది. మహారాష్ట్రకు చెందిన రాధ అని పిలిచే ఈ గేదెను చూసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ కూడా ఆశ్చర్యపోయింది. కేవలం 2 అడగులు పొడవున్న ఈ రాధ ప్రత్యేకతేంటో ఇక్కడ చూద్దాం..

మహారాష్ట్రలోని మాలావాడి గ్రామంలోని ప్రశాంత వీధుల్లో ఒక ప్రత్యేక అతిథి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.. రాధ అనే ఒక చిన్న గేదె ఇప్పుడు ప్రపంచంలోనే అతి చిన్న గేదెగా ప్రసిద్ధి చెందింది. ఈ రాధనను చూడటానికి సుదూర ప్రాంతాల నుండి కూడా ప్రజలు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. రాధను చూసేందుకు వస్తున్న సందర్శకులు, స్థానికులతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది.
రాధ ప్రత్యేకత ఏమిటి?:
రాధ ఎత్తు కేవలం 2 అడుగుల 8 అంగుళాలు. త్రింబక్ బోరాటే పొలంలో నివసిస్తుంది. ఇది ముర్రా హైబ్రిడ్ గేదె. సాధారణ గేదెలు 8 నుండి 9 అడుగుల పొడవు ఉండగా రాధ చాలా చిన్నది.
13 కంటే ఎక్కువ ప్రదర్శనలలో పాల్గొంది:
త్రింబక్ బోరాటే కుమారుడు అనికేత్ రాధను ఒక వ్యవసాయ ప్రదర్శనకు తీసుకెళ్లాడు. డిసెంబర్ 21న రాధ మొదటిసారిగా ఒక కార్యక్రమంలో పాల్గొంది. అప్పటి నుండి 13 కి పైగా ప్రదర్శనలకు హాజరైంది. ఆమె అందం, ప్రశాంతమైన స్వభావం ప్రజల హృదయాలను గెలుచుకుంది.
గిన్నిస్ రికార్డులో చోటు:
నివేదికల ప్రకారం, ఈ చిన్న గేదె రాధ పేరు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది. దీంతో ఆ రైతు కుటుంబీకులు ఆనందంలో మునిగిపోయారు. రాధ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి కీర్తిని తెస్తుందని, ప్రపంచవ్యాప్తంగా జంతుప్రేమికుల హృదయాలను గెలుచుకుంటుందని అనికేత్ చెప్పారు.
వీడియో ఇక్కడ చూడండి..
కింగ్ కాంగ్ తో పోలిస్తే బిగ్ బఫెలో:
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గేదె గురించి చెప్పాలంటే, థాయిలాండ్‌లోని ప్రసిద్ధ గేదె, కింగ్ కాంగ్ 6 అడుగుల కంటే ఎక్కువ పొడవు ఉంటుంది. ఇప్పుడు రాధ ఆ రికార్డ్‌ని బ్రేక్ చేసింది. కింగ్‌కాంగ్ కంటే దాదాపు 4 అడుగుల ఎత్తు తక్కువగా ఉంటుంది. కానీ, గొప్ప గుర్తింపు సాధించింది.
రాధ దినచర్య ఏమిటి?:
రాధకు పొలాల్లో తిరగడం, పచ్చని గడ్డి తినడం, నీటిలో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం. ఇతర గేదెల మాదిరిగానే రాధ ప్రశాంతంగా ఉంటుంది. కానీ, అన్ని పశువుల్లో కెల్లా రాధ చిన్న పరిమాణం దానిని ప్రత్యేకంగా చేస్తుంది.




