AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: సమయానికి జాకెట్ కుట్టి ఇవ్వని టైలర్.. 15 వేలు ఫైన్.. అంతేకాక

మంచి క్లాత్ కొన్నాం.... దాన్ని టైలర్ సరిగ్గా కుడతారా..? సమయానికి ఇస్తారా అని మహిళలు ఆందోళన చెందుతూ ఉంటారు. అయితే అడ్వాన్స్‌ చెల్లించినా సకాలంలో బ్లౌజ్‌ కుట్టకపోవడంతో ఓ దర్జీకి పెద్ద దెబ్బ తగిలింది. ఆ డీటేల్స్ తెలుసుకుందాం పదండి...

Viral: సమయానికి జాకెట్ కుట్టి ఇవ్వని టైలర్.. 15 వేలు ఫైన్.. అంతేకాక
Tailor (Representative image)
Ram Naramaneni
| Edited By: TV9 Telugu|

Updated on: Jul 31, 2024 | 3:40 PM

Share

ఏ విషయం అయినా సహిస్తారే కానీ.. చెప్పిన సమయానికి డ్రెస్సులు, బ్లౌజులు ఇవ్వకపోతే మహిళల ఆగ్రహం మరోలా ఉంటుంది. చాలా ఇష్టపడి క్లాత్ కొనుక్కుంటారు.. ఫలానా ఫంక్షన్ లేదా ఈవెంట్ రోజున దాన్ని ధరించాలని ఆశపడతారు. దర్జీ కాస్త ధర ఎక్కువ చెప్పినా.. సరే.. అనుకున్న టైంకి ఇవ్వాలని కండీషన్ పెడతారు. డిజైన్‌లో తేడా వచ్చిన.. కుట్టి ఇవ్వడం లేటు అయినా ఇక సీన్ మరోలా ఉంటుంది. కొందరు దర్జీలు అయితే నెలల తరబడి లేట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి సందర్భాల్లో గొడవలు కూడా అవుతూ ఉంటాయి. తాజాగా మహారాష్ట్రలోని ధారాశివ్‌లో అలాంటి ఘటనే జరిగింది. అడ్వాన్స్‌ చెల్లించినా సకాలంలో బ్లౌజ్‌ కుట్టకపోవడంతో ఓ దర్జీకి పెద్ద దెబ్బ తగిలింది. లేడీ టైలర్ రూ. 15,000 జరిమానా చెల్లించవలసి వచ్చింది. అంతేకాదు శిక్ష కింద బ్లౌజ్‌ను ఉచితంగా కుట్టి ఇవ్వాల్సి వచ్చింది. వినియోగదారుల ఫోరం విధించిన ఈ శిక్ష చాలామంది టైలర్స్‌కు గుణపాఠం అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

అసలు ఏం జరిగింది?

ఈ ఘటన ధారశివ్‌లో చోటుచేసుకుంది. జనవరి 2023లో ఫిర్యాదుదారు స్వాతి ప్రశాంత్ కస్తూరే నగరంలోని.. టైలర్  నేహా సంత్‌కు రెండు వర్క్ బ్లౌజ్‌లను ఇచ్చింది. ఇందుకోసం మొత్తం రూ.6 వేల 300 బిల్లు అవుతుందని చెప్పగా… రూ.3 వేలు అడ్వాన్స్ కూడా చెల్లించింది స్వాతి. కానీ నేహా సంత్ అడ్వాన్స్ మొత్తం తీసుకున్నా చెప్పిన సమయానికి స్వాతికి బ్లౌజ్‌లు ఇవ్వలేదు.

స్వాతి… నేహాను ఫోన్ ద్వారా పలుమార్లు సంపద్రించింది. మెసేజులు చేసింది. అయినా కూడా నో రెస్పాన్స్. ఇక లాభం లేదని భావించి.. 28 ఏప్రిల్ 2023న స్వాతి వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార ఫోరమ్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో కన్జూమర్ ఫోరం నేహాకు నోటీసులు జారీ చేసింది. అయితే ఆ నోటీసుపై స్పందించకుండా నేహా సంత్ విచారణకు గైర్హాజరయ్యారు. అందువల్ల, వినియోగదారుల ఫోరమ్ 15 జూలై 2024న ఏకపక్షంగా ఉత్తర్వులు జారీ చేసింది.  నేహా సంత్ రూ. 15,000 జరిమానాను స్వాతి కస్తూరేకు చెల్లించాలని ఆదేశించింది. శిక్షగా స్వాతి బ్లౌజ్‌ని ఉచితంగా కుట్టించాలని కూడా నేహాకు ఆదేశాలు వచ్చాయి.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..