ఆ సూప్‌కు ‘45ఏళ్లు’.. బ్యాంకాక్‌లో ‘భలే’ టేస్ట్

సాధారణంగా ఇంట్లో గానీ,హోటళ్లలో గానీ మరెక్కడైనా గానీ.. పదార్థం వండడం, అది ఖాళీ అయిన తరువాత ఆ పాత్రలను క్లీన్ చేస్తుండటం చేస్తుంటారు. అయితే ఒక హోటల్‌లో మాత్రం ఒక పాత్రను క్లీన్ చేయకుండా సంవత్సరాలుగా వాడుతున్నారు. ఒకటి, రెండు కాదు 45సంవత్సరాలుగా ఆ పాత్రలో సూప్‌ను తయారుచేస్తున్నారు. అంతేకాదు ముందురోజు మిగిలిన సూప్‌లోనే మళ్లీ తాజా మాంసం ముక్కలు, తదితర పదార్థాలు వేసి చేస్తుంటారు. వివరాల్లోకి వెళ్తే.. బ్యాంకాక్‌లో వాట్టన్నపానిచ్ అనే పేరుతో ఒక రెస్టారెంట్‌ను […]

ఆ సూప్‌కు ‘45ఏళ్లు’.. బ్యాంకాక్‌లో ‘భలే’ టేస్ట్
Follow us

| Edited By:

Updated on: Jul 31, 2019 | 1:10 PM

సాధారణంగా ఇంట్లో గానీ,హోటళ్లలో గానీ మరెక్కడైనా గానీ.. పదార్థం వండడం, అది ఖాళీ అయిన తరువాత ఆ పాత్రలను క్లీన్ చేస్తుండటం చేస్తుంటారు. అయితే ఒక హోటల్‌లో మాత్రం ఒక పాత్రను క్లీన్ చేయకుండా సంవత్సరాలుగా వాడుతున్నారు. ఒకటి, రెండు కాదు 45సంవత్సరాలుగా ఆ పాత్రలో సూప్‌ను తయారుచేస్తున్నారు. అంతేకాదు ముందురోజు మిగిలిన సూప్‌లోనే మళ్లీ తాజా మాంసం ముక్కలు, తదితర పదార్థాలు వేసి చేస్తుంటారు.

వివరాల్లోకి వెళ్తే.. బ్యాంకాక్‌లో వాట్టన్నపానిచ్ అనే పేరుతో ఒక రెస్టారెంట్‌ను నడుపుతోంది ఓ కుటుంబం. వారు గత 45ఏళ్లుగా ఒకే పాత్రలో సూప్‌ను తయారుచేస్తున్నారు. పైగా దానిని శుభ్రం చేయకుండా చేస్తున్నారు. ఇక దీనిపై రెస్టారెంట్ యజమాని నట్టాపోంగ్ చెబుతూ.. తాము అనుసరించే వంటపద్ధతి ద్వారా ఆ సూప్‌కు ప్రత్యేక రుచి, సువాసన వస్తుందని అన్నారు. ఇదిలా ఉంటే ఈ సూప్‌కు ఉన్న రుచి వలన దీనిని కొనుగోలు చేసేందుకు స్థానికులు ఎగబడుతుండటం మరో విశేషం.