Viral Photo: ఈ ఫోటో చూడగానే మీకు ఏం కనిపించింది.? దానిబట్టి మీరు ఎలాంటి వారో చెప్పొచ్చు..

Viral Photo: సైకాలజీ అనేది ఒక పెద్ద సముద్రం లాంటిది. మనం మాట్లాడే మాట ఆదారంగానే కాకుండా మనం చూసే చూపు, మన ముక కదలికల ఆధారంగా మనం ఎలాంటి వాళ్లమే కనిపెట్టే పవర్‌ సైకాలజీకి ఉంది. సైక్రియాట్రిస్ట్‌లు వీటి ఆధారంగా ఒక వ్యక్తిని అంచనా వేస్తారు. మనిషి...

Viral Photo: ఈ ఫోటో చూడగానే మీకు ఏం కనిపించింది.? దానిబట్టి మీరు ఎలాంటి వారో చెప్పొచ్చు..
Viral Photo
Follow us

|

Updated on: Mar 18, 2022 | 3:36 PM

Viral Photo: సైకాలజీ అనేది ఒక పెద్ద సముద్రం లాంటిది. మనం మాట్లాడే మాట ఆదారంగానే కాకుండా మనం చూసే చూపు, మన ముక కదలికల ఆధారంగా మనం ఎలాంటి వాళ్లమే కనిపెట్టే పవర్‌ సైకాలజీకి ఉంది. సైక్రియాట్రిస్ట్‌లు వీటి ఆధారంగా ఒక వ్యక్తిని అంచనా వేస్తారు. మనిషి వ్యక్తిత్వాన్ని తెలుసుకోవడానికి సైక్రియాట్రిస్ట్‌లు రకరకాల టెక్నిక్స్‌ను ఉపయోగిస్తుంటారు. అలాంటి వాటిలో ఒకటి ఆప్టికల్‌ ఇల్యూషన్‌ పర్సనాలిటీ టెస్ట్‌. ఒక ఫోటోను చూపించి అందులో ఏం కనిపిస్తుందో చెప్పమని అడగడం ద్వారా మన వ్యక్తిత్వాన్ని అంచనా వేయడమే ఈ పరీక్ష ముఖ్య ఉద్దేశం.

Viral Photo

 

పైన కనిపిస్తున్న ఫోటో ఇలాంటి ఆప్టికల్‌ ఇల్యూషన్‌ పర్సనాలిటీ టెస్ట్‌కు సంబంధించినదే. పైన ఫోటోను ఉన్నపలంగా చూడగానే కొందరికి పుర్రెను పోలిన బొమ్మ కనిపిస్తుంది. అలాగే మరికొందరికి ఆ చిన్నారి కనిపిస్తుంది, అలాగే మరికొందరికి ప్రకృతి కనిపిస్తుంది. అయితే మీకు మొదట చూడగానే ఏం కనిపిచిందో దానిని బట్టి మీ మానస్తత్వం ఎలాంటిదో ఓ అంచనా వేయొచ్చు.

పుర్రె:

ఫోటోని చూడగానే పుర్రె కనిపించిందా.. అయితే అదేదో తప్పని భావించకండి. ఎందుకంటే ముందుగా పుర్రె కనిపించిన వారు చాలా మేధావులు. మీకున్న గొప్ప బలం మీ మేధో సంపత్తి అని అర్థం. మీరు చాలా లోతైన ఆలోచన కలిగిన వారని అర్థం. మీరు తెలివైన వారని అర్థం చేసుకోవాలి.

బాలిక:

ఫోటోలో మొదట అమ్మాయి కనిపిస్తే మీరు గతంలోని కష్టాల నుంచి త్వరగా బయటపడతారని అర్థం. మీకు ఎదురైన కష్టాల నుంచి ఎంతో సులువుగా బయటపడతారు. జీవితంపై ప్రత్యేక దృక్పథాన్ని కలిగి ఉంటారు. ఎలాంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినా అస్సలు ఒత్తిడికి లోను కాకుండా ఆలోచనతో సమస్య నుంచి బయటపడతారు.

ప్రకృతి:

ఇక ఫోటో చూడగానే మీకు బ్రౌగ్రౌండ్‌లో కనిపిస్తున్న సీనరి కనిపిస్తే.. మిమ్మల్ని మీరు నమ్ముకునే వ్యక్తులని అర్థం. అందరూ భయాందోళనకు గురయ్యే సందర్భాల్లో.. మీరు మాత్రం మీ గట్‌ ఫీలింగ్‌పై నమ్మకంతో ఉంటారు. ఎందుకంటే మీరు చేస్తున్న పని సరైందని విశ్వసిస్తారు. క్లిష్ట సమయాల్లోనూ మీరు తీసుకునే సరైన నిర్ణయాలతో సులువుగా బయటపడతారు.

Also Read: Bheemla Nayak Aha: ఆహాలో పవర్ స్ట్రోమ్.. స్ట్రీమింగ్‏కు సిద్ధమైన బ్లాక్ బస్టర్ భీమ్లా నాయక్..

IPL 2022: స్పాట్ ఫిక్సింగ్ నుంచి షారుఖ్ ఖాన్ నిషేధం వరకు.. ఐపీఎల్ చరిత్రలో అతిపెద్ద వివాదాలు ఇవే..

Team India: కెరీర్ చివరి వన్డేలో విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడిన సచిన్.. విరాట్‌తో కలిసి పాకిస్తాన్‌ తాటతీసిన భారత దిగ్గజం