ఆకాశంలో అద్భుతం.. ఏకంగా ఏడు సూర్యులు ఒకేసారి ఉదయించిన దృశ్యం కనువిందు.. ఎక్కడంటే..

ఆగస్టు 18న జరిగిన ఈ ఘటన ఇప్పుడు భారత్‌లోనూ దావానలంలా వ్యాపిస్తోంది. విశ్వంలో ఒకే ఒక్క సూర్యుడు అని తెలుసు. కానీ, ఇప్పుడు ఏడు సూర్యులను చూడటం వెనుక కారణం ఏమిటి అని ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు. పైగా ఒక నిమిషం పాటు ఆ అద్భుత దృశ్యం ఆకాశంలో కనిపించింది. ఈ మొత్తం సంఘటనకు గల కారణం ఏంటి..?

ఆకాశంలో అద్భుతం.. ఏకంగా ఏడు సూర్యులు ఒకేసారి ఉదయించిన దృశ్యం కనువిందు.. ఎక్కడంటే..
Seven Suns In China
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 29, 2024 | 1:59 PM

ఆకాశంలో ఓ ఆశ్చర్యకరమైన దృశ్యం కనిపించింది. ఒక మహిళ ఆకాశంలో కనిపించిన ఆ అద్భుతమైన దృశ్యాన్ని చూసి వెంటనే తన సెల్‌ఫోన్‌లో రికార్డ్ చేసింది. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు దీనిని చూసి ఆశ్చర్యపోతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఈ అద్భుత దృశ్యం చైనాలో కనిపించినట్టుగా తెలిసింది. చైనాలోని చెంగ్డూ నగరంలో ఆకాశంలో అకస్మాత్తుగా ఏడు సూర్యులు కనిపించారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇది చూసి, ఇది ఎలా సాధ్యమని అందరూ ఆశ్చర్యపోతున్నారు. కాగా, దీన్ని వాంగ్ అనే మహిళ ఆసుపత్రి కిటికీలోంచి షుట్‌ చేసినట్టుగా చెప్పింది.

ఆగస్టు 18న జరిగిన ఈ ఘటన ఇప్పుడు భారత్‌లోనూ దావానలంలా వ్యాపిస్తోంది. విశ్వంలో ఒకే ఒక్క సూర్యుడు ఉంటే, ఏడు సూర్యులను చూడటం వెనుక కారణం ఏమిటి అని ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు. పైగా ఒక నిమిషం పాటు ఆ అద్భుత దృశ్యం ఆకాశంలో కనిపించింది. ఈ మొత్తం సంఘటనకు గల కారణం ఏంటి..? ఏడు సూర్యులను చూడడానికి కారణం సైన్స్‌కి సంబంధించినది అంటున్నారు నిపుణులు. అదేంటంటే..

ఇవి కూడా చదవండి

సైన్స్ భాషలో దీనిని ఆప్టికల్ ఇల్యూషన్ అని కూడా అంటారు. విండో గ్లాస్ 7 పొరలు ఉన్నందున, కాంతి వక్రీభవనం తర్వాత ప్రతి పొర సూర్యుని నీడను సృష్టిస్తుంది. దీనిని ఆప్టికల్ ఇల్యూషన్ అని కూడా అంటారు. ఆకాశంలో ఏకకాలంలో ఏడు సూర్యులు కనిపించడానికి కారణం ఇదే. ఈ వీడియో X హ్యాండిల్ @TheFigen_లో షేర్‌ చేయబడింది. ఇది ఇప్పటివరకు 8.4 మిలియన్ల వరకు వీక్షించారు. పోస్ట్‌పై నెటిజన్లు పెద్ద సంఖ్యలో తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

ఈ పోస్ట్ పై క్లిక్ చేయండి..

ఇది ఆప్టికల్ ఇల్యూషన్ అని చాలా మంది చెబుతున్నారు. అయితే ఇది చాలా అందంగా ఉందని ఒకరు రాశారు. సైన్స్ ఫిక్షన్ సినిమాల్లోనిది ఈ సీన్‌ అన్నట్టుగా ఉందని మరొకరు రాశారు. మరొకరు దీనిపై స్పందిస్తూ.. ఇది AI రూపొందించినట్లు కనిపిస్తోంది అన్నారు. ఇక మరొకరు దీనిపై స్పందిస్తూ.. చైనాతో మనం ఎప్పటికీ పోటీపడలేమని ఇది రుజువు చేస్తుందంటున్నారు. ఇలా చాలా మంది నెటిజన్లు తమ భిన్నమైన అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..