AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: ప్రపంచంలోనే అతిపెద్ద క్లాక్ టవర్‌పై ఉరుములు, మెరుపులు.. అద్భుత దృశ్యాన్ని చూడాల్సిందే..! ఇదిగో వీడియో

గ్రాండ్ మసీదు సమీపంలో ఉన్న ప్రపంచంలోని అత్యంత ఎత్తైన, అత్యంత ప్రసిద్ధ క్లాక్ టవర్‌లలో ఒకదానిని మెరుపులు ఢీకొట్టాయి. మక్కా క్లాక్ టవర్ మక్కా నడిబొడ్డున ఒక ప్రముఖ మైలురాయిగా నిలుస్తుంది. దాని అద్భుతమైన వాస్తుశిల్పం ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఈ వీడియోకి ఇప్పటివరకు 2 లక్షల 53 వేలకు పైగా వీక్షణలు వచ్చాయి. చాలా మంది వినియోగదారులు దీనిపై వ్యాఖ్యానించారు కూడా. అది కూడా విపరీతంగా షేర్ అవుతోంది.

Watch: ప్రపంచంలోనే అతిపెద్ద క్లాక్ టవర్‌పై ఉరుములు, మెరుపులు.. అద్భుత దృశ్యాన్ని చూడాల్సిందే..! ఇదిగో వీడియో
Mecca Clock Tower
Jyothi Gadda
| Edited By: |

Updated on: Aug 29, 2024 | 2:35 PM

Share

ఇస్లాం మతంలో మక్కా అత్యంత ముఖ్యమైన ప్రదేశం. ఇది ఇస్లాం మతంలో పవిత్ర స్థలంగా ప్రసిద్ధి చెందింది. అలాగే మక్కాలోని క్లాక్ టవర్ ప్రపంచంలోనే అతిపెద్ద క్లాక్ టవర్‌గా గుర్తింపు పొందింది. అయితే ఇటీవల మక్కాలో తీవ్రమైన తుఫాను వచ్చింది. ఈ సమయంలో మక్కాలోని ఈ ప్రసిద్ధ క్లాక్ టవర్‌పై వచ్చిన ఒక మెరుపు అతి భయనకంగా కనిపించింది. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతున్నాయి. దీన్ని చూసిన యూజర్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఈ మెరుపు ఎంత భయానకంగా ఉందో వీడియోలో చూస్తే ఎవరికైనా భయంతో గుండెలు జారిపోయే పరిస్థితి ఏర్పడుతుంది.

ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. క్లాక్ టవర్ పై మెరుపులు పడుతున్న దృశ్యం చూసి మీరు కూడా భయపడిపోతారు. మెరుపులు పడుతున్న దృశ్యాలు స్పష్టంగా కనిపించటం చాలా అరుదుగా కనిపిస్తుంది. అయితే ఈ ఘటన కెమెరాలో చిక్కింది. ఈ అసాధారణ దృశ్యానికి సంబంధించిన వీడియో ఆగష్టు 27న వెలుగులోకి వచ్చింది. శక్తివంతమైన ఉరుములతో కూడిన తుఫాను సమయంలో సౌదీ అరేబియాలోని మక్కా క్లాక్ టవర్‌పై మెరుపులను తాకినట్లుగా తెలుస్తోంది. ఈ దృశ్యాన్ని చాలా మంది చూశారు. క్లాక్ టవర్‌పై మెరుపు ఎలా పడిందో వీడియోలో మీరు చూస్తారు. ఇది మొదట ఆకు ఆకారంలో కనిపిస్తుంది. ఆకాశంలో సరళ రేఖ కనిపిస్తుంది. ఆ విద్యుత్తు చాలా శక్తివంతమైనది. దాని కాంతి వేగంగా విస్తరించింది. అలాగే వీడియోలో మెరుపు శబ్దం కూడా భయంకరంగా వినిపిస్తోంది.

ఇవి కూడా చదవండి

దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో శరవేగంగా షేర్ అవుతున్నాయి. ఈ వీడియో X హ్యాండిల్ @Mal_hothalyలో కూడా షేర్‌ చేశారు. ఈ వీడియోకి ఇప్పటివరకు 2 లక్షల 53 వేలకు పైగా వీక్షణలు వచ్చాయి. చాలా మంది వినియోగదారులు దీనిపై వ్యాఖ్యానించారు కూడా. అది కూడా విపరీతంగా షేర్ అవుతోంది. ఈ వీడియోకి ఇప్పటివరకు 2 లక్షల 53 వేలకు పైగా వీక్షణలు వచ్చాయి. చాలా మంది వినియోగదారులు దీనిపై వ్యాఖ్యానించారు కూడా. అది కూడా విపరీతంగా షేర్ అవుతోంది.

ఈ వీడియో చూడండి..

గ్రాండ్ మసీదు సమీపంలో ఉన్న ప్రపంచంలోని అత్యంత ఎత్తైన, అత్యంత ప్రసిద్ధ క్లాక్ టవర్‌లలో ఒకదానిని మెరుపులు ఢీకొట్టాయి. మక్కా క్లాక్ టవర్ మక్కా నడిబొడ్డున ఒక ప్రముఖ మైలురాయిగా నిలుస్తుంది. దాని అద్భుతమైన వాస్తుశిల్పం ప్రపంచ ప్రసిద్ధి చెందింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
భక్తితో గుడికెళ్లారనుకుంటే.. ఈ భార్యాభర్తలు ఏకంగా దేవుడికే..
భక్తితో గుడికెళ్లారనుకుంటే.. ఈ భార్యాభర్తలు ఏకంగా దేవుడికే..
2025లో ఆంధ్రప్రదేశ్‌ను తీవ్ర విషాదంలోకి నెట్టిన ఘోర ప్రమాదాలు ఇవే
2025లో ఆంధ్రప్రదేశ్‌ను తీవ్ర విషాదంలోకి నెట్టిన ఘోర ప్రమాదాలు ఇవే