AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: కిటికీ దగ్గర మీ ఫోన్‌ భద్రం… ఇట్లాంటి దొంగతనాలు ఈ మధ్య ఎక్కువైనయ్‌..

ఈ మధ్య సెల్‌ఫోన్‌ దొంగలు బాగా తెలివిమీరారు. రైల్వేస్టేషన్లలో, బస్‌స్టేషన్‌లలో ప్రయాణికులే టార్గెట్‌గా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా రైళ్లలో కిటికీ పక్కన, డోర్‌ వద్ద ఫోన్‌ మాట్లాడే వారే టార్గెట్‌. రైలు కదిలి కాస్తా స్పీడ్‌ అందుకోగాన కిటీకి వద్దకు దసుకొచ్చి సెల్‌ఫోన్‌ తీసుకుని...

Viral Video: కిటికీ దగ్గర మీ ఫోన్‌ భద్రం... ఇట్లాంటి దొంగతనాలు ఈ మధ్య ఎక్కువైనయ్‌..
Cell Phone Theft At Train W
K Sammaiah
|

Updated on: Oct 10, 2025 | 8:46 PM

Share

ఈ మధ్య సెల్‌ఫోన్‌ దొంగలు బాగా తెలివిమీరారు. రైల్వేస్టేషన్లలో, బస్‌స్టేషన్‌లలో ప్రయాణికులే టార్గెట్‌గా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా రైళ్లలో కిటికీ పక్కన, డోర్‌ వద్ద ఫోన్‌ మాట్లాడే వారే టార్గెట్‌. రైలు కదిలి కాస్తా స్పీడ్‌ అందుకోగాన కిటీకి వద్దకు దసుకొచ్చి సెల్‌ఫోన్‌ తీసుకుని పరార్‌ అవుతుంటారు. ఇలాంటి సంఘటనలు ఇప్పటికే అనేకం వెలుగులోకి వచ్చాయి. ప్రయాణికులు పరధ్యానంగా ఉండొద్దని పోలీసులు హెచ్చరిస్తూనే ఉంటారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతోంది.

ప్రయాణంలో పరధ్యానం వచ్చే ఇబ్బందులపై అవగాహన కల్పించేందుకు ఓ ఆర్పీఎఫ్ అధికారి చేసిన ప్రయత్నం ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వైరల్‌ వీడియో ప్రకారం ఓ రైలులో ఓ మహిళ కిటికీ పక్క సీటులో కూర్చుని ఉంది. తన చేయిని కిటికీపై పెట్టి ఫోన్‌ మాట్లాడుతూ ఉంటుంది. ఇలాంటి సమయంలోనే దొంగలు ఫోన్లను లాక్కెళుతుంటారు. ఆ మహిళకు ఈ విషయంపై అవగాహన కల్పించేందుకు ఆర్పీఎఫ్ అధికారి రంగంలోకి దిగారు. రైలు వద్దకు వెళ్లి హఠాత్తుగా రైలు కిటికీలో నుంచి ఆమె ఫోన్‌ను లాక్కున్నాడు. దీంతో ఆమె ఒక్కసారిగా షాక్‌ అయింది. దొంగలేమో అని భయపడిపోయింది.

అయితే ఆ వెంటనే ఫోన్‌ను మహిళకు తిరిగిచ్చేసిన అధికారి ఆమెను హెచ్చరించారు. కిటికీకి దగ్గరగా ఫోన్ పట్టుకుని ఉంటే ఇలా దొంగలు ఎత్తుకెళుతారని మహిళకు అవగాహన కల్పించారు. దీంతో ఆ మహిళకు తన తప్పు తెలిసొచ్చినట్లయింది.

వీడియో చూడండి:

ఈ వీడియో వైరల్‌ కావడంతో నెటిజన్స్‌ కామెంట్స్‌ పెడుతున్నారు. మహిళ తన జీవితంలో ఇంకెప్పుడూ ఇలాంటి పొరపాటు చేయదని అంటున్నారు. ఇంకా నయం ఇంకొకరికయితే గుండె అగినంత పనయ్యేదని మరికొందరు పోస్టులు పెడుతున్నారు.