Viral Video: వావ్ వాటే ఐడియా.. ముల్లు తీయడం ఇంత ఈజీనా… అంతా ట్రాష్ అంటున్న నెటిజన్స్
ఎవరికైనా కాలుకో చేతికో ముల్లు ఇరిగిందంటే అది తీసేదాకా నిద్ర పట్టదు. గ్రామాల్లో పశువులు మేపేవారికి, వ్యవసాయ పనులు చేసే వారికి ముల్లు గుచ్చుకోవడం అనేది సర్వసాధారణం. అయితే కొన్ని రకాల ముల్లులు మాత్రం ఎంత ప్రయత్నించినా బయటికి రావు. విషపు ముల్లుల వల్ల ఇన్‌ఫెక్షన్ అయి...

ఎవరికైనా కాలుకో చేతికో ముల్లు ఇరిగిందంటే అది తీసేదాకా నిద్ర పట్టదు. గ్రామాల్లో పశువులు మేపేవారికి, వ్యవసాయ పనులు చేసే వారికి ముల్లు గుచ్చుకోవడం అనేది సర్వసాధారణం. అయితే కొన్ని రకాల ముల్లులు మాత్రం ఎంత ప్రయత్నించినా బయటికి రావు. విషపు ముల్లుల వల్ల ఇన్‌ఫెక్షన్ అయి కాలు కొట్టేసిన సందర్భాలు కూడా గ్రామాల్లో కనిపిస్తుంటాయి. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోన్న ఓ వీడియో నెటిజన్స్‌ని ఇట్టే అకట్టుకుంటోంది. వేలిలో గుచ్చుకున్న ముల్లును ఓ మహిళ ఎంతో సింపుల్‌గా తీసేసింది. ఈమె టెక్నిక్ చూసి అంతా అవాక్కవుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
వీడియోలో ఓ మహిళకు వేలిలో ముల్లు గుచ్చుకుంది. దాన్ని బయటికి తీసేందుకు ఆమె నానా తంటాలు పడింది. అయినా ముల్లు మాత్రం బయటికి రాలేదు. ఈ క్రమంలో పక్కనున్న మరో మహిళ వినూత్నంగా ఆ ముల్లును వెల్లుల్లి సహాయంతో చాలా ఈజీగా తీసేసింది. ముందుగా ఆ మహిళ వంటింట్లో వెల్లుల్లిని తీసుకొచ్చింది. దాని తొక్క తీసి ముల్లు ఉన్న ప్రాంతంలో పెట్టింది. ఆ తర్వాత దానిపై బ్యాండేజ్‌ను అతికించడం వీడియోలో చూడొచ్చు. ఇలా కొద్ది సేపటి తర్వాత.. ఆ బ్యాండేజ్‌ను తీసేయడం కనిపిస్తుంది. ఆశ్చర్యకరంగా వేలు లోపల ఉన్న ముల్లు పైకి రావడం చూస్తుంటాం. ఈ ట్రిక్‌ను చూసి నెటిజన్స్ అవాక్కవుతున్నారు.
వీడియో చూడండి:
काटा निकलने का निंजा टेक्निक…. pic.twitter.com/q8k6w9ksMY
— घर का वैद्य (@healthcaree_) November 3, 2025
అయితే కొందరు దీన్ని అంతా ట్రాష్ అంటున్నారు. సోషల్ మీడియాలో రీల్ కోసం చేసినట్లు ఉందని చెబుతున్నారు. అయితే వీడియో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో దూసుకెళుతోంది. నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. ‘ఇలాంటి వాళ్లు ఉంటే ఆస్పత్రులతో పనే లేదు’.. అంటూ కొందరు, ‘ఇదంతా వ్యూస్ కోసం చేసినట్లుగా ఉంది.. అలా జరగడం అసాధ్యం’.. అంటూ మరికొందరు పోస్టులు పెడుతున్నారు.
