Viral Video: ఇంతకు ఈ సారు జాబ్ కొట్టాడా.. కొన్నాడా?… ఇంగ్లీష్ స్పెల్లింగ్‌లు రాని టీచర్‌పై నెటిజన్స్ ఫైర్
ఇంటిలో తల్లిదండ్రులను, బడిలో ఉపాధ్యాయులను పిల్లలు అనుసరిస్తూ ఉంటారు. ఆ మాటకొస్తే ఇంటిలో కంటే పాఠశాలలోనే ఎక్కువ సమయం గడుపుతుంటారు. ఈ క్రమంలో ఉపాధ్యాయుల ప్రభావం విద్యార్థుల మీద ఎక్కువగా ఉంటుంది. తరగతి గదిలోనే దేశ నిర్మాణం జరగుతుందంటారు. ఈ నేపథ్యంలో పిల్లలకు పాఠాలు...

ఇంటిలో తల్లిదండ్రులను, బడిలో ఉపాధ్యాయులను పిల్లలు అనుసరిస్తూ ఉంటారు. ఆ మాటకొస్తే ఇంటిలో కంటే పాఠశాలలోనే ఎక్కువ సమయం గడుపుతుంటారు. ఈ క్రమంలో ఉపాధ్యాయుల ప్రభావం విద్యార్థుల మీద ఎక్కువగా ఉంటుంది. తరగతి గదిలోనే దేశ నిర్మాణం జరగుతుందంటారు. ఈ నేపథ్యంలో పిల్లలకు పాఠాలు చెప్పే ముందు ఉపాధ్యాయులు వెల్ ప్రిపేర్ అయి వస్తుంటారు. కానీ, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఓ వీడియోను చూస్తే ఉపాధ్యాయులు విద్యార్థుల చదువు పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారనేది దానికి అద్దం పడుతుంది.
ఛత్తీస్‌గర్ బలరాంపూర్ జిల్లాలోని ఒక ప్రాథమిక పాఠశాలలో అసిస్టెంట్ టీచర్ ప్రవీణ్ టోప్పో పిల్లలకు తప్పు ఇంగ్లీష్ స్పెల్లింగ్‌లు బోధిస్తున్న వీడియో ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. దీంతో సదరు టీచర్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. వాద్రాఫ్‌నగర్ బ్లాక్‌లోని మచందండ్ కోగ్వార్ ప్రాథమిక పాఠశాలలో ఈ సంఘటన జరిగింది, ఇది సోషల్ మీడియాలో విస్తృత విమర్శలకు దారితీసింది.
వైరల్ వీడియోలో, టోప్పో ముక్కుకు “నోజ్”, చెవికి “ఇయర్” మరియు కంటికి “ఐయ్” వంటి తప్పు స్పెల్లింగ్‌లను వ్రాసి బోధిస్తున్నట్లు చూడవచ్చు. తరువాత దర్యాప్తులో వారంలోని రోజులకు సంబంధించిన స్పెల్లింగ్‌లు తండ్రి, తల్లి, సోదరుడు, సోదరి వంటి ప్రాథమిక కుటుంబ పదాలు కూడా తరగతి గది బ్లాక్‌బోర్డ్‌పై తప్పుగా బోధించినట్ల తేలింది.
వీడియో చూడండి:
‘Iey मतलब आंख, Noge मतलब नाक’ सिखाने वाले टीचर का वीडियो वायरल, शिक्षा विभाग ने किया सस्पेंड https://t.co/3QfKQr4WFI#Chhattisgarh #CGNews #Ambikapur #English #Teacher pic.twitter.com/cGiollwCXo
— NaiDunia (@Nai_Dunia) November 16, 2025
వీడియో వేగంగా వ్యాపించడంతో జిల్లా విద్యా కార్యాలయం ఉపాధ్యాయుడి ప్రవర్తనపై విచారణ ప్రారంభించింది. డిఇఓ ఎం.ఆర్. యాదవ్ పాఠశాలను తనిఖీ చేయడానికి క్లస్టర్ కోఆర్డినేటర్‌ను నియమించారు. దర్యాప్తులో పిల్లలు తరగతి గదిలో తప్పు స్పెల్లింగ్‌లు నేర్చుకుంటున్నారని అధికారులు నిర్ధారించారు.
దర్యాప్తు తర్వాత నిర్లక్ష్యం, విషయ పరిజ్ఞానం లేకపోవడం వల్ల DEO అసిస్టెంట్ టీచర్ ప్రవీణ్ టోప్పోను సస్పెండ్ చేశారు. 42 మంది విద్యార్థులున్న పాఠశాలలో ఇప్పుడు ఒకే ఒక ఉపాధ్యాయుడు మాత్రమే ఉన్నారు.
తప్పు స్పెల్లింగ్‌లను బోధించడం వల్ల వారి పిల్లల విద్యపై తీవ్ర ప్రభావం పడుతుందని పేర్కొంటూ తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సమర్థుడైన ఉపాధ్యాయుడిని నియమించాలని కోరుతున్నారు.
వైరల్ వీడియోపై నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. అంతటి అసమర్థుడైన వ్యక్తిని ఎలా ఎంపిక చేశారనేది అతిపెద్ద ప్రశ్న. అతని నియామక లేఖను జారీ చేసిన అధికారులు ఎవరు? అడిని ఇంటర్వ్యూ చేసి తీసుకున్నారా లేక అతను ఉద్యోగం కొన్నాడా? అంటూ పలు రకాల ప్రశ్నలు సందిస్తున్నారు. అతన్ని సస్పెండ్ చేయడానికి బదులుగా, అతనికి శిక్షణ ఇవ్వాలని మరికొంతమంది నెటిజన్స్ సూచిస్తున్నారు.
