Viral Video: అయ్యో బిడ్డగదనే.. నీకు చెతులెలా వచ్చాయే.. నర్సరీ చిన్నారిని కాలుతో తొక్కుతూ పాశవిక దాడి
హైదరాబాద్ షాపూర్‌నగర్‌లోని పూర్ణిమా స్కూల్‌లో దారుణం వెలుగుచూసింది. నర్సరీ చదువుతున్న చిన్నారిపై పైశాచికంగా దాడి చేసింది ఆ స్కూల్‌లో పనిచేస్తున్న ఆయా. ఆయా దాడి చేస్తున్న దృశ్యాలను ఫోన్‌లో రికార్డ్ చేశాడు స్థానిక యువకుడు. ఆయా దాడి కారణంగా తీవ్ర అస్వస్థతకు గురయింది చిన్నారి. దీంతో చిన్నారిని ఆస్పత్రికి...

హైదరాబాద్ షాపూర్‌నగర్‌లోని పూర్ణిమా స్కూల్‌లో దారుణం వెలుగుచూసింది. నర్సరీ చదువుతున్న చిన్నారిపై పైశాచికంగా దాడి చేసింది ఆ స్కూల్‌లో పనిచేస్తున్న ఆయా. ఆయా దాడి చేస్తున్న దృశ్యాలను ఫోన్‌లో రికార్డ్ చేశాడు స్థానిక యువకుడు. ఆయా దాడి కారణంగా తీవ్ర అస్వస్థతకు గురయింది చిన్నారి. దీంతో చిన్నారిని ఆస్పత్రికి తరలించగా తీవ్ర గాయాలయినట్టు వైద్యులు గుర్తించారు.
మరోవైపు ఈ వీడియో వెలుగులోకి రావడంతో స్కూల్ యాజమాన్యాన్ని పశ్నించారు చిన్నారి తల్లిదండ్రులు. అయినా స్కూల్ యాజమాన్యం పట్టించుకోకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు చిన్నారి తల్లిదండ్రులు. ఆయాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పిల్లలను ఆయాలకు అప్పగించే విషయంలో ఈ ఘటన తల్లిదండ్రుల్లో తీవ్ర భయాందోళన రేకెత్తించింది. చిన్నారిపై ఆయా దాడి చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
వైరల్ వీడియోలో నర్సరీ చిన్నారిపై ఆయా విచక్షణారహితంగా దాడి చేసింది. చిన్నారిని ఇష్టానుసారం కొట్టడమే కాక.. ఆమెపై కాలు వేసి తొక్కుతూ దారుణంగా హింసించింది. ఆయా ఆ విధంగా పాశవికంగా దాడి చేస్తుండగా పక్క భవనంలో ఉన్న ఒక యువకుడు తన సెల్ ఫోన్‌లో రికార్డ్ చేశాడు.
ఆదివారం ఆ వీడియో వాట్సాప్ గ్రూప్‌లలో వైరల్ కావడంతో.. తల్లిదండ్రులు ఆ వీడియో ఆధారంగా జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం బాలికకు స్థానిక ఆసుపత్రిలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు.
వీడియో చూడండి:
View this post on Instagram
