AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: గుంతల రోడ్డు మీద దెయ్యాలతో లాంగ్ జంప్ చేయిస్తున్న యముడు, చిత్రగుప్తుడు .. ఫన్నీ వీడియో వైరల్

జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి గ్రామీణ రహదారులతోపాటు దాదాపు అన్ని రహదారులపై గుంతలు దర్శనమిస్తున్నాయి. గుంతల కారణంగా చాలా మంది వాహనదారులు ప్రాణాలు కోల్పోతున్నారు. అయినా సంబంధిత అధికారులు, రాజకీయ నాయకులు పట్టించుకోవడం లేదు. అయితే రోడ్లమీద గుంతల విషయంలో ప్రజలు రకరకాలు గా తమ నిరసన ను ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు.

Viral Video: గుంతల రోడ్డు మీద దెయ్యాలతో లాంగ్ జంప్ చేయిస్తున్న యముడు, చిత్రగుప్తుడు .. ఫన్నీ వీడియో వైరల్
Viral Video
Surya Kala
|

Updated on: Aug 28, 2024 | 7:20 PM

Share

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రమే కాదు దేశంలో అనేక ప్రాంతాల్లోని రహదారులు గతుకుల మయంగా కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా గుంతల రోడ్లే దర్శనం ఇస్తున్నాయి. వాహన దారులకు ఈ రోడ్ల మీద ప్రయాణం ఓ సమస్యగా మారుతోంది. ఇలా రోడ్లు గుంతల మాయం కావడానికి కారణం నాసిరకం పనులు అని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి గ్రామీణ రహదారులతోపాటు దాదాపు అన్ని రహదారులపై గుంతలు దర్శనమిస్తున్నాయి. గుంతల కారణంగా చాలా మంది వాహనదారులు ప్రాణాలు కోల్పోతున్నారు. అయినా సంబంధిత అధికారులు, రాజకీయ నాయకులు పట్టించుకోవడం లేదు. అయితే రోడ్లమీద గుంతల విషయంలో ప్రజలు రకరకాలు గా తమ నిరసన ను ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు.

తాజాగా కృష్ణాష్టమి సందర్భంగా రోడ్ల పరిస్థితులను తెలుపుతూ చేసిన విచిత్ర పని ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. కన్నయ్య కొలువైన ప్రముఖ క్షేత్రం ఉడిపిలో ఉట్ల ఉత్సవం సందర్భంగా గుంతలతో నిండిన రోడ్డు మధ్యలో యమ ధర్మ రాజు, చిత్రగుప్తుల వేషధారణలు వేసి దెయ్యాల వేషధారులకు లాంగ్ జంప్ పోటీలు ఏర్పాటు చేశారు. ఈ విధంగా రోడ్ల పరిస్థితులను వివరించారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారడంతో పాటు నెటిజన్ల ప్రశంసలు అందుకుంటున్నాయి.

ఇవి కూడా చదవండి

దీనికి సంబంధించి వీడియోను కార్తీక్ రెడ్డి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X లో షేర్ చేశారు.”యమ ధర్మ రాజు కర్ణాటకలోని ఉడిపిలో దెయ్యాల కోసం లాంగ్ జంప్ పోటీని నిర్వహించారు” అనే క్యాప్షన్ జత చేశారు ఈ వీదియోకు. వైరల్ వీడియోలో గుంతలు పడిన రోడ్డుపై నిలబడి దెయ్యం వేషధారణ చేసేవారి కోసం యమరాజు, చిత్రగుప్త వేషధారులు లాంగ్ జంప్ చేసే ఒక తమాషా దృశ్యాన్ని చూడవచ్చు.

వైరల్ వీడియోను ఇక్కడ చూడండి:

ఆగస్టు 27న షేర్ చేసిన ఈ వీడియోను 47,000 మంది చూడగా.. రకరకాల కామెంట్‌లు వచ్చాయి. ఉడిపిలోని కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు అధికారుల దృష్టికి ఈ విషయాన్ని ఎందుకు తీసుకెళ్లలేదని ఓ వినియోగదారు ప్రశ్నించారు. మరొక వినియోగదారు, “మీరు ఫన్నీ వీడియో ద్వారా సమస్యలను అద్భుతంగా వివరించారు అంటూ వ్యాఖ్యానించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..