Viral Video: రెండు చక్రాలపై ట్రక్ ని నడిపి గిన్నీస్ రికార్డ్ సాధించిన స్టంట్ డ్రైవర్
గిన్నీస్ బుక్ లో చోటు సంపాదించు కోవాలని ఎంతో మంది ప్రయత్నిస్తూంటారు. దీని కోసం తమ ప్రాణాలని కూడా రిస్క్ లో పెడతారు. కొత్త కొత్తవి చేస్తూ గిన్నీస్ బుక్ లో చోటు సంపాదించుకుంటారు. గిన్నీస్ బుక్ లో చోటు సంపాదించాలంటే చాలా కష్టం. దీని కోసం కొత్త ప్రయోగాలే కాకుండా.. ఎవరూ చేయని విధంగా చేస్తూండాలి. అలాగే పాత రికార్డ్స్ ని కూడా బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది. దీంతో చాలా మంది పాత రికార్డ్స్ ను కూడా చేస్తూ ఓల్డ్ రికార్డ్స్ బద్దలు కొడుతూంటారు. ఇలా ఎంతో మంది..

గిన్నీస్ బుక్ లో చోటు సంపాదించు కోవాలని ఎంతో మంది ప్రయత్నిస్తూంటారు. దీని కోసం తమ ప్రాణాలని కూడా రిస్క్ లో పెడతారు. కొత్త కొత్తవి చేస్తూ గిన్నీస్ బుక్ లో చోటు సంపాదించుకుంటారు. గిన్నీస్ బుక్ లో చోటు సంపాదించాలంటే చాలా కష్టం. దీని కోసం కొత్త ప్రయోగాలే కాకుండా.. ఎవరూ చేయని విధంగా చేస్తూండాలి. అలాగే పాత రికార్డ్స్ ని కూడా బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది. దీంతో చాలా మంది పాత రికార్డ్స్ ను కూడా చేస్తూ ఓల్డ్ రికార్డ్స్ బద్దలు కొడుతూంటారు. ఇలా ఎంతో మంది గిన్నీస్ బుక్ లో చోటు సాధించారు. అన్ని రకాల వయసుల వారు గిన్నీస్ బుక్ లో స్థానం సంపాదించుకుంటున్నారు. తాజాగా ఒక స్టంట్ డ్రైవర్ రెండు చక్రాలపై ట్రక్ ని నడిపి గిన్నీస్ బుక్ లో చోటు సాధించాడు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
ఇటలీకి చెందిన ఓ స్టంట్ డ్రైవర్ ట్రక్ క్యాబ్ ను రెండు చక్రాలపై 12 అడుగుల, 5 అంగుళాల గ్యాప్ ద్వారా ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. మార్కో డేవిడ్ జియోనీ అనే 43 ఏళ్ల వ్యక్తి ట్రక్ ని ఉపయోగించి, ఎడమ వైపు చక్రాల పైకి తెచ్చుకున్నాడు. ఆ తర్వాత సైడ్ బారియర్ లను తాకకుండా ఇరుకైన గ్యాప్ లో ట్రక్ ను తీసుకొచ్చాడు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ నిబంధనల ప్రకారం.. జియోని కనీసం 32.8 అడుగులు, వాహనం బోల్తా పడకుండా నడపాలి. జియోని తన మూడో ప్రయత్నంలో ఈ ఘనతను సాధించాడు.
అనంతరం మార్కో డేవిడ్ జియోనీ మాట్లాడుతూ.. ట్రక్కు క్యాబిన్ చాలా ఎక్కువగా కదులుతుంది. ట్రక్ ని మేనేజ్ చేయడం కష్టంగా మారింది. అందుకే మరింత ఏకాగ్రత పెట్టి తన మూడో ప్రయత్నంలో విజయం సాధించ గలిగానని చెప్పారు మార్కో డేవిడ్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియో పై మీరు కూడా ఓ లుక్ వేసేయండి.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
