AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: నీ దండం పెడతా ఆపురరేయ్‌…వెనకోడికి ప్యాంట్‌ తడిసినట్లుందిగా… ఇసొంటివే వద్దనేది అంటున్న నెటిజన్స్‌

సోషల్‌ మీడియా అందుబాటులో వచ్చాక ప్రతి ఒక్కరు ఏదో విధంగా వైరల్‌ కావడానికి ప్రయత్నిస్తున్నారు. రీల్స్‌ పిచ్చిలో పడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ప్రమాదకరంగా స్టంట్స్‌ చేస్తూ ప్రమాదాల భారిన పడుతున్నారు. అలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియలో సోషల్‌ మీడియాలో అనేకం వైరల్‌...

Viral Video: నీ దండం పెడతా ఆపురరేయ్‌...వెనకోడికి ప్యాంట్‌ తడిసినట్లుందిగా... ఇసొంటివే వద్దనేది అంటున్న నెటిజన్స్‌
Scooty Rider Standing
K Sammaiah
|

Updated on: Nov 25, 2025 | 5:23 PM

Share

సోషల్‌ మీడియా అందుబాటులో వచ్చాక ప్రతి ఒక్కరు ఏదో విధంగా వైరల్‌ కావడానికి ప్రయత్నిస్తున్నారు. రీల్స్‌ పిచ్చిలో పడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ప్రమాదకరంగా స్టంట్స్‌ చేస్తూ ప్రమాదాల భారిన పడుతున్నారు. అలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియలో సోషల్‌ మీడియాలో అనేకం వైరల్‌ అవుతుంటాయి. ప్రస్తుతం గోవా నుంచి వచ్చిన ఓ వీడియో కూడా నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ స్కూటీ మీద యువకుల స్టంట్‌ వీడియో వైరల్‌ అవుతోంది.

పసుపు రంగు హూడీ ధరించిన వ్యక్తి వేగంగా వెళ్తున్న స్కూటర్‌పై నిటారుగా నిలబడి ఉండటం వీడియోల చూడొచ్చు. అతని వెనుక నల్లటి హూడీ ధరించిన మరొక వ్యక్తి కూర్చున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వైరల్ క్లిప్‌లో బైక్‌పై ఉన్న వ్యక్తులు పదేపదే హెచ్చరించినప్పటికీ, రైడర్ హెల్మెట్ లేకుండా అధిక వేగంతో డ్రైవింగ్ చేస్తున్నట్లు కనిపిస్తుంది, వారు అతనిని వేగాన్ని తగ్గించమని అడుగుతున్నట్లు వినవచ్చు.

వీడియో చూడండి:

రద్దీగా ఉన్న రోడ్డుపై రికార్డ్ చేసినట్లుగా ఫుటేజ్‌లో కనిపిస్తోంది. స్కూటీ అతి వేగంతో దసుకెళుతుండగా యువకుడు ప్రమాదకరమైన స్టంట్ చేస్తున్నట్లు చూపిస్తుంది. ఈ చర్య రైడర్, అతని వెనుక ప్రయాణీకుడిని మాత్రమే కాకుండా వారి చుట్టూ ఉన్న వాహనదారులు, పాదచారులను కూడా ప్రమాదంలో పడేస్తుందని నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు.

వీడియోను చూసిన నెటిజన్స్‌ తీవ్రంగా స్పందించారు. ఈ నిర్లక్ష్యాన్ని చాలా మంది విమర్శించారు. “జీవితాలతో ఆడుకోవాల్సిన అవసరం లేదు, వైరల్ అవ్వాల్సిన అవసరం లేదు” అని కొందరు కామెంట్స్‌ పెట్టారు. ట్రాఫిక్ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని మరికొందరు డిమాండ్ చేశారు. ఇటువంటి ప్రవర్తన ప్రధాన రహదారిపై ఏ క్షణంలోనైనా తీవ్రమైన ప్రమాదానికి దారితీయవచ్చని హెచ్చరించారు.

గోవాలో యువ రైడర్లు ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తున్న సంఘటనలు గతంలో కూడా వెలుగులోకి వచ్చాయి. పోలీసులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. అయినప్పటికీ, కొంతమంది వ్యక్తులు రహదారి భద్రతా నియమాలను ఉల్లంఘిస్తూనే ఉన్నారని అధికారులు చెబుతున్నారు. అయినా వైరల్‌ వీడియోలని వ్యక్తులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.