AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaibhav Suryavanshi : పాకిస్తాన్ ముందు వైభవ్ ఫ్లాప్ షో..సిక్సర్ల వీరుడు 5 పరుగులకే అవుట్!

Vaibhav Suryavanshi : పాకిస్తాన్‌తో జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి విఫలమయ్యాడు. ఈ లెఫ్ట్ హ్యాండ్ పవర్ హిట్టర్ కేవలం 6 బంతుల్లో 5 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. ఒక బౌండరీ కొట్టి, 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద క్యాచ్ డ్రాప్ ద్వారా ఒక లైఫ్ లైన్ పొందినప్పటికీ, వైభవ్ దానిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు.

Vaibhav Suryavanshi : పాకిస్తాన్ ముందు వైభవ్ ఫ్లాప్ షో..సిక్సర్ల వీరుడు 5 పరుగులకే అవుట్!
Vaibhav Suryavanshi
Rakesh
|

Updated on: Dec 14, 2025 | 1:28 PM

Share

Vaibhav Suryavanshi : పాకిస్తాన్‌తో జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి విఫలమయ్యాడు. ఈ లెఫ్ట్ హ్యాండ్ పవర్ హిట్టర్ కేవలం 6 బంతుల్లో 5 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. ఒక బౌండరీ కొట్టి, 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద క్యాచ్ డ్రాప్ ద్వారా ఒక లైఫ్ లైన్ పొందినప్పటికీ, వైభవ్ దానిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. చివరకు లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ సయ్యం వేసిన బౌలింగ్‌లో బంతిని కొట్టి, ఆ బౌలర్‌కే క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇంతకీ పాకిస్తాన్‌పై త్వరగా అవుట్ అవ్వడానికి వైభవ్ చేసిన పొరపాటు ఏమిటో తెలుసుకుందాం.

సాధారణంగా వైభవ్ సూర్యవంశీ తన చేతుల్లో ఉన్న బలం కారణంగానే భారీ సిక్సర్లు, పవర్ షాట్లు కొడతాడు. కానీ పాకిస్తాన్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో అదే బలం ఆయనకు బలహీనతగా మారింది. వైభవ్ అవుటైన బంతి పిచ్‌కు కాస్త ఇరుక్కుని వచ్చి, కొంచెం అధికంగా లేచింది. ఈ సమయంలో వైభవ్ బ్యాట్ చాలా వేగంగా బంతిని తాకడంతో, అది నేరుగా బౌలర్ చేతుల్లోకి వెళ్లిపోయింది. కామెంట్రీ చేస్తున్న నిపుణులు కూడా ఇదే విషయం చెప్పారు.. ఒకవేళ సూర్యవంశీ తన కింది చేయి పట్టును కాస్త వదులుగా ఉంచి ఉంటే, బంతిని ఆలస్యంగా ఆడి, దాన్ని నేలకేసి కొట్టే అవకాశం ఉండేదని అభిప్రాయపడ్డారు.

వరుసగా రెండోసారి పాకిస్తాన్‌పై విఫలం కావడం వైభవ్ సూర్యవంశీని తీవ్ర నిరాశకు గురిచేసి ఉంటుంది. గతంలో 2024లో జరిగిన అండర్-19 ఆసియా కప్‌లో కూడా వైభవ్ పాకిస్తాన్‌పై విఫలమయ్యాడు. ఆ మ్యాచ్‌లో అతను 9 బంతుల్లో కేవలం 1 పరుగు మాత్రమే చేయగలిగాడు. ఈ సమయంలో వైభవ్ ఫామ్ అద్భుతంగా ఉన్న నేపథ్యంలో ఆయన మరింత నిరాశ చెందుతాడు. ఎందుకంటే గత మ్యాచ్‌లోనే యూఏఈపై 95 బంతుల్లో 14 సిక్సర్లతో సహా 171 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆడాడు.

అయినా సరే, వైభవ్ సూర్యవంశీ నిరాశ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆసియా కప్ సెమీ-ఫైనల్ లేదా ఫైనల్‌లో టీమిండియాకు మళ్లీ పాకిస్తాన్‌తో తలపడే అవకాశం ఉంది. రెండు జట్లు నాకౌట్ దశకు చేరుకుంటాయని ఆశిస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే వైభవ్ తన గత రెండు పొరపాట్లను సరిదిద్దుకుని, పాకిస్తాన్‌పై తన సత్తా చాటడానికి మరో అవకాశం లభిస్తుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..