AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yashasvi Jaiswal : 48 బంతుల్లోనే సెంచరీ.. సెలక్టర్లకు బ్యాట్‌తో జవాబిచ్చిన యశస్వి జైస్వాల్

Yashasvi Jaiswal : టీమిండియా వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఫామ్ లేమితో జట్టు సతమతమవుతుంటే, మరోవైపు జట్టు నుంచి దూరంగా ఉన్న యువ సంచలనం యశస్వి జైస్వాల్ బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు. ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హర్యానాపై మెరుపు సెంచరీతో తన జట్టుకు విజయాన్ని అందించాడు.

Yashasvi Jaiswal : 48 బంతుల్లోనే సెంచరీ.. సెలక్టర్లకు బ్యాట్‌తో జవాబిచ్చిన యశస్వి జైస్వాల్
Yashasvi Jaiswal
Rakesh
|

Updated on: Dec 14, 2025 | 2:29 PM

Share

Yashasvi Jaiswal : టీమిండియా వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఫామ్ లేమితో జట్టు సతమతమవుతుంటే, మరోవైపు జట్టు నుంచి దూరంగా ఉన్న యువ సంచలనం యశస్వి జైస్వాల్ బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు. ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హర్యానాపై మెరుపు సెంచరీతో తన జట్టుకు విజయాన్ని అందించాడు. ముంబై తరఫున ఆడిన జైస్వాల్ కేవలం 48 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో 1 సిక్స్, 16 ఫోర్లు ఉన్నాయి. 235 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే ఒత్తిడితో కూడిన మ్యాచ్‌లో జైస్వాల్ ఈ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడటం విశేషం.

యశస్వి జైస్వాల్ బ్యాటింగ్‌కు దిగగానే హర్యానా బౌలర్లను ఉతికి ఆరేశాడు. ఈ యువ ఆటగాడు కేవలం 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి, ఆ తర్వాత 45 బంతుల్లో సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. సెంచరీ చేసే క్రమంలో జైస్వాల్ 7 బంతులను డాట్ చేసినప్పటికీ, కేవలం 48 బంతుల్లోనే శతకం సాధించడం విశేషం. ఇది టీ20 ఫార్మాట్‌లో జైస్వాల్‌కు నాల్గవ సెంచరీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మొదటిది కావడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్ 101 పరుగులు చేయగా, ముంబై జట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముంబై జట్టు కేవలం 17.3 ఓవర్లలోనే మ్యాచ్‌ను గెలిచింది. జైస్వాల్‌తో పాటు సర్ఫరాజ్ ఖాన్ కూడా 25 బంతుల్లో 64 పరుగులు చేసి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.

యశస్వి జైస్వాల్ తన ఈ సెంచరీ ఇన్నింగ్స్‌తో భారత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌లకు బ్యాట్‌తో గట్టి సమాధానం చెప్పాడు. అద్భుతమైన టీ20 ఇంటర్నేషనల్ రికార్డ్ ఉన్నప్పటికీ, జైస్వాల్‌ను జట్టులోకి సెలక్ట్ చేయడం లేదు. అతనికి బదులుగా ఈ ఫార్మాట్‌లో పదేపదే విఫలమవుతున్న శుభ్‌మన్ గిల్తో ఓపెనింగ్ చేయిస్తున్నారు. టీ20 ఇంటర్నేషనల్‌లో యశస్వి జైస్వాల్ 23 మ్యాచ్‌లలో 36.16 సగటుతో 723 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. రాబోయే టీ20 ప్రపంచ కప్‌కు ముందు సెలెక్టర్లు యశస్వికి అవకాశం ఇస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..