AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tilak Varma : ఆ బ్యూటీఫుల్ నేపాలీ క్రికెటర్ ప్రేమలో తిలక్ వర్మ ? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త

Tilak Varma : భారత జట్టు యువ బ్యాట్స్‌మెన్ తిలక్ వర్మ ప్రస్తుతం కేవలం మైదానంలోనే కాదు, సోషల్ మీడియాలోనూ సంచలనం సృష్టిస్తున్నారు. "తిలక్ వర్మ, నేపాల్‌కు చెందిన అందమైన క్రికెటర్ ఇందు బర్మతో డేటింగ్ చేస్తున్నారా? వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందా?

Tilak Varma : ఆ బ్యూటీఫుల్ నేపాలీ క్రికెటర్ ప్రేమలో తిలక్ వర్మ ? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త
Tilak Varma
Rakesh
|

Updated on: Dec 14, 2025 | 2:57 PM

Share

Tilak Varma : భారత జట్టు యువ బ్యాట్స్‌మెన్ తిలక్ వర్మ ప్రస్తుతం కేవలం మైదానంలోనే కాదు, సోషల్ మీడియాలోనూ సంచలనం సృష్టిస్తున్నారు. “తిలక్ వర్మ, నేపాల్‌కు చెందిన అందమైన క్రికెటర్ ఇందు బర్మతో డేటింగ్ చేస్తున్నారా? వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందా?” అనే ప్రశ్నలు ఇప్పుడు ఇంటర్నెట్‌ను ఊపేస్తున్నాయి. సోషల్ మీడియాలో ఈ ఇద్దరు క్రికెటర్ల ఫోటోలు వైరల్ అవుతుండగా, వారు రిలేషన్‌షిప్‌లో ఉన్నారంటూ పలు పోస్టులు కనిపిస్తున్నాయి. అయితే ఈ పోస్టులు, ఫోటోల వెనుక ఉన్న నిజానిజాలను ధృవీకరించడానికి ఎలాంటి అధికారిక ఆధారం లేదని గమనించాలి. ఈ వార్తల గురించిన పూర్తి వివరాలు, సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం.

28 ఏళ్ల ఇందు బర్మ నేపాల్ మహిళా క్రికెట్ జట్టు సభ్యురాలు. ఆమె జట్టులో బ్యాటింగ్ ఆల్‌రౌండర్‌గా వ్యవహరిస్తుంది. కుడి చేతితో బ్యాటింగ్, బౌలింగ్ చేస్తుంది. ఇందు బర్మ నేపాల్ తరఫున ఇప్పటి వరకు 78 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో ఆడింది. బ్యాట్‌తో 1041 పరుగులు చేయడమే కాకుండా, 40 వికెట్లు కూడా తీసింది. ఇందు బర్మ తన ఆటతోనే కాకుండా, తన అందంతో కూడా మహిళా క్రికెట్‌లో చాలా ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం ప్రపంచంలోని టాప్ 10 మహిళా క్రికెటర్లలో ఇందు బర్మ ఒకరిగా పరిగణించబడుతుంది.

ఇక తిలక్ వర్మ విషయానికొస్తే.. అతను ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతున్న టీమిండియా టీ20 సిరీస్‌లో సభ్యుడిగా ఉన్నాడు. ఈ సంవత్సరం భారత్, పాకిస్తాన్‌ను ఓడించి గెలిచిన ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో కూడా తిలక్ వర్మ కీలక పాత్ర పోషించాడు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ అయిన తిలక్ వర్మ ఇప్పటివరకు భారతదేశం తరఫున 5 వన్డేలు, 38 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడాడు.

తిలక్ వర్మ ప్రపంచంలోని పలు ప్రాంతాలకు వెళ్లి భారత్ తరఫున క్రికెట్ ఆడాడు. కానీ, ఆయన ఎప్పుడూ నేపాల్‌లో క్రికెట్ ఆడలేదు. కాబట్టి, ఇందు బర్మతో తిలక్‌కు అసలు పరిచయం ఎప్పుడు జరిగింది? వారిద్దరూ కలుసుకోకుండానే రిలేషన్‌షిప్ ఎలా ఏర్పడింది? ఈ ప్రశ్నలే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వార్తల్లో నిజం లేదని సందేహాన్ని కలిగిస్తున్నాయి. అంతేకాకుండా ఆ పోస్టుల్లో ఇందు బర్మ, తిలక్ వర్మతో ఉన్నట్లు చూపించిన ఫొటోలు కూడా ఏఐ జనరేటెడ్ ఫొటోల్లా కనిపిస్తున్నాయి. దీంతో ఈ వార్త కేవలం పుకారు మాత్రమే కావచ్చని భావిస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..