Viral Video: నీటిలో కొట్టుకుపోతున్న జింక పిల్లను కాపాడిన కుక్క.. షాకింగ్ వీడియో మీకోసం..
Viral Video: కుక్క ప్రవర్తనకు, మనిషి ప్రవర్తనకు దాదాపు చాలా వరకు పోలికలు ఉంటాయి. మనుషుల మధ్య జీవించడం వల్ల కాబోలు..
Viral Video: కుక్క ప్రవర్తనకు, మనిషి ప్రవర్తనకు దాదాపు చాలా వరకు పోలికలు ఉంటాయి. మనుషుల మధ్య జీవించడం వల్ల కాబోలు.. కొన్ని మానవత్వపు లక్షణాలు వాటిలో కనిపిస్తుంటాయి. తాజాగా ఓ కుక్కకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నదిలో మునిగిపోతున్న జింక పిల్లను సురక్షితంగా కాపాడి ఒడ్డుకు చేర్చింది. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట్లో రచ్చ చేస్తోంది.
వివరాల్లోకెళితే.. ఓ నదిలో జింక పిల్ల కొట్టుకుపోతోంది. అది గమనించిన కుక్క వెంటనే నదిలోకి దూకింది. ఈదుకుంటూ వెళ్లి కొట్టుకుపోతున్న జింక పిల్లను నోటితో పట్టుకుంది. క్షేమంగా దానిని బయటకు తీసుకువచ్చింది. కాగా, కుక్క.. జింక పిల్లను రక్షిస్తుండగా దాని యజమాని వీడియో తీశాడు. అనంతరం ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాంతో వీడియో కాస్తా వైరల్‌గా మారింది. కుక్క జాలి గుణం, మానవత్వానికి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఈ వీడియోను ఇప్పటి వరకు లక్షకు పైగా నెటిజన్లు వీక్షించగా, వేలాది లైక్స్ వచ్చాయి. కుక్క సాహసానికి సెల్యూట్ కొడుతున్నారు.
Also read: