గూగుల్‌లో మరో భారతీయ ఆణిముత్యం !! ఈ యువతి వేతనం కోటీపైనే !! వీడియో

గూగుల్‌లో మరో భారతీయ ఆణిముత్యం !! ఈ యువతి వేతనం కోటీపైనే !! వీడియో

Phani CH

|

Updated on: Jan 21, 2022 | 9:32 AM

టాలెంట్‌ ఎక్కడున్నా వెతికి పట్టుకోవడంలో టెక్‌ దిగ్గజ కంపెనీలు ఎప్పుడూ ముందుంటాయి. ఈ తరుణంలో భారత్‌ నుంచి ఎక్కువ మేధోసంపత్తిని వెలికి తీస్తుంటాయి.

టాలెంట్‌ ఎక్కడున్నా వెతికి పట్టుకోవడంలో టెక్‌ దిగ్గజ కంపెనీలు ఎప్పుడూ ముందుంటాయి. ఈ తరుణంలో భారత్‌ నుంచి ఎక్కువ మేధోసంపత్తిని వెలికి తీస్తుంటాయి. బడా బడా కంపెనీల సీఈవోలుగా భారత మూలాలు ఉన్నవాళ్లు, భారీ ప్యాకేజీలు అందుకుంటున్న వాళ్లలో భారతీయ టెక్కీలు ఉండడమే ఇందుకు నిదర్శనం. ఇదిలా ఉంటే తాజాగా ఓ భారత యువతికి కోటి రూపాయలకు పైగా ప్యాకేజీతో బంపరాఫర్‌ ఇచ్చింది గూగుల్‌. బిహార్‌లోని పట్నాకు చెందిన సంప్రీతి యాదవ్‌ గూగుల్‌ నిర్వహించిన క్యాంపస్‌ డ్రైవ్‌లో అదరగొట్టింది. చదువు, ఆటలు, సంగీతం, అన్నింట్లోనూ ముందుండే సంప్రీతి.. గూగుల్‌లో కోటీ పదిలక్షల వేతనంతో ఉద్యోగాన్నీ సంపాదించింది.