New Innovation: అద్భుతం అంటే ఇదే కదా.. కరెంట్ లేకుండా నడిచే ‘ట్రెడ్‌మిల్’.. మైండ్ బ్లోయింగ్ ఆవిష్కరణ..!

New Innovation: జిమ్‌కు వెళ్లి వ్యాయామం చేసే వారికి ట్రెడ్‌మిల్ ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రన్నింగ్ వర్కౌట్ చేయడానికి ట్రెడ్‌మిల్ వినియోగిస్తారు.

New Innovation: అద్భుతం అంటే ఇదే కదా.. కరెంట్ లేకుండా నడిచే ‘ట్రెడ్‌మిల్’.. మైండ్ బ్లోయింగ్ ఆవిష్కరణ..!
Tredmil
Follow us

|

Updated on: Mar 25, 2022 | 8:17 AM

New Innovation: జిమ్‌కు వెళ్లి వ్యాయామం చేసే వారికి ట్రెడ్‌మిల్ ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రన్నింగ్ వర్కౌట్ చేయడానికి ట్రెడ్‌మిల్ వినియోగిస్తారు. చాలా మంది జిమ్‌కు వెళ్లలేని వారు.. ఇంట్లోనే ట్రెడ్‌మిల్ ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే, ఇది నడవాలంటే విద్యుత్ అవసరం. కానీ, ఇక్కడ ఓ వ్యక్తి ఇలాంటి కరెంట్ గానీ, ఎలక్ట్రానిక్ పరికరాలు గానీ అవసరం లేకుండానే నడిచే అద్భుతమైన ట్రెడ్‌మిల్ తయారు చేశాడు. ట్రెడ్‌మిల్ కి మించి పని చేస్తున్న ఈ ఆవిష్కరణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సాధారణ గ్రామీణ వ్యక్తి ఈ ఆవిష్కరణ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. ఈ ఇన్నోవేషన్.. ప్రజలను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

ఈ వీడియోలో ఓ వ్యక్తి ‘ట్రెడ్ మిల్‌’ ను కలప సహాయంతో తయారు చేశాడు. ఎలాంటి విద్యుత్ అవసరం లేకుండా దానిపై పరుగులు తీసి ఔరా అనిపించాడు. ఈ ఆవిష్కరణకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ట్రెడ్‌మిల్‌ను తయారు చేయడానికి చెక్కలను, బోల్డ్‌లను మాత్రమే ఉపయోగించాడు. నట్ బోల్డ్‌లపై చెక్కలను పేర్చి.. వృత్తాకారంలో తిరిగేలా ఫిక్స్ చేశాడు. పూర్తిస్థాయి ట్రెడ్‌మిల్ రూపు ఇచ్చాడు. అనంతరం తాను దానిపై రన్నింగ్ చేసి చూపించాడు. చెక్కతో చేసిన ఈ ట్రెడ్‌మిల్‌కు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. గ్రామీణ ఆణిముత్యం అని ప్రశంసలు కురిపిస్తున్నారు. ట్విట్టర్‌లో ఈ వీడియోను షేర్ చేయగా.. ఇప్పుడు లక్షన్నరకు పైగా వ్యూస్ వచ్చాయి. వేలాది లైక్స్ వచ్చాయి. మరెందుకు ఆలస్యం ఈ ఆవిష్కరణను మీరూ చూసేయండి.

Viral Video:

Also read:

Leopard vs Phone: ఫోన్ కాపాడిన ప్రాణం.. దెబ్బకు పరుగులు తీసిన చిరుతపులి.. పూర్తివివరాలివే..!

Viral News: మహిళపై విరుచుకుపడుతున్న నెటిజన్లు.. కారణం ఏంటో తెలిస్తే ప్యూజులు ఎగిరిపోతాయి..!

ఈ పువ్వు ఒక్కసారి వాడిపోతే 12 సంవత్సరాల తర్వాత వికసిస్తుంది.. భారత్‌లో మాత్రమే ఉండే ఈ పువ్వు ప్రత్యేకతలు మీకోసం..!