AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ప్రపంచంలో ఎనిమిదో వింత ఈ కీటకం.. ఆకులో ఆకుగా.. వీడియో చూస్తే స్టన్ అవుతారు

సృష్టిలో ప్రకృతిలో అనేక చిత్ర విచిత్రలున్నాయి. ప్రకృతిలో కనిపించే ప్రతిదీ ఒక అద్భుతమైన కళాఖండం. ప్రకృతిలో జరిగే ప్రతి ప్రక్రియ ఒక రహస్యం, ఒక వింత. ఎన్నో రకాల మొక్కలు, జంతువులు, పక్షులు, కీటకాలు ఉన్నాయి. ప్రతి జీవి తనదైన ప్రత్యేకతతో విభిన్నంగా కనిపిస్తుంది. అలాంటి ఒక కీటకం గురించి ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఈ జీవికి ప్రకృతి ఒక ప్రత్యేక శక్తిని ఇచ్చింది. దాని సహాయంతో అది సులభంగా తన ఆకారాన్ని మార్చుకుంటుంది. ఇదే వీడియోలో కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.

Viral Video: ప్రపంచంలో ఎనిమిదో వింత ఈ కీటకం.. ఆకులో ఆకుగా.. వీడియో చూస్తే స్టన్ అవుతారు
Viral Video
Surya Kala
|

Updated on: Aug 05, 2025 | 1:35 PM

Share

ఈ భూమిపై ఉన్న ప్రతి జీవికి ప్రకృతి ప్రత్యేక శక్తులను ఇచ్చింది. వేటాడే జంతువులకు ప్రత్యేక సామర్థ్యాలు ఉన్నట్లే.. వేటకు ఎరగా మారే జీవులకు కూడా తమను తాము రక్షించుకోవడానికి అనేక రకాల మార్గాలు ఉన్నాయి. ఈ భూమిపై ఎన్నో రకాలైన జీవులు ఉన్నాయి. అవి తమను తాము రక్షించుకోవడానికి ఎన్నో రకాల పనులు చేస్తాయి. ఇటీవల సోషల్ మీడియాలో ఒక షాకింగ్ వీడియో చక్కర్లు కొడుతోంది. అందులో ప్రకృతిలో వింతని, ప్రకృతిలోని కళాత్మకత ఏమిటనేది తెలియజేస్తుంది. ఈ వీడియో చూసిన ప్రజలు ఆశ్చర్యపోయారు.

వీడియోలో ఎండిన, కుళ్ళిన ఆకు కనిపిస్తుంది. అయితే వాస్తవానికి అది ఒక కీటకం. ఈ అద్భుతమైన సాలీడు సాధారణ జాతికి చెందినది కాదు. అరియోవిక్సియా గ్రిఫిండోరి. ప్రకృతి దీనికి మనుషులను మభ్యపెట్టే శక్తిని ఇచ్చింది. దీంతో ఇది తన రంగు, రూపాన్ని పూర్తిగా ఎండిన ఆకుగా మార్చుకుంటుంది. సాలీడు శరీరం వెనుక భాగం ఆకుపచ్చగా ఉంది. ఇది ఆకుపచ్చ ఆకులా కనిపిస్తుంది. ముందు భాగం ఎండిన ఆకులా గోధుమ రంగులో ఉంది. ఇది ఏ ఇతర మాంసాహార జంతువు తనని ఆహారంగా చేసుకోకుండా ఉండటానికి ఇలా శరీరం ఆకారాన్ని మార్చుకుంటుంది.

ఇవి కూడా చదవండి

వీడియోను ఇక్కడ చూడండి

‘హ్యారీ పాటర్’ సిరీస్‌లోని ‘సార్టింగ్ టోపీ’ కి ప్రేరణ ఈ సాలీడు అనిపిస్తుంది. దీనిని ‘ఆకువంటి సాలీడు’ అని కూడా పిలుస్తారు. ఈ వింత సాలీడుని 2015 సంవత్సరంలో కర్ణాటక అడవులలో శాస్త్రవేత్తల బృందం – జావేద్ అహ్మద్, రాజ్‌శ్రీ ఖలప్, సుముఖ జవగల్ కనుగొన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో కనిపించినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఏ జీవి కూడా ఇలా చేయదు. ఎవరూ దీనిని ఊహించలేదు.

ఈ సాలీడు వీడియోను ఇటీవల @AMAZlNGNATURE అనే హ్యాండిల్ షేర్ చేసింది. దీనిని 99 లక్షల మందికి పైగా షేర్ చేశారు. 1.38 లక్షల లైక్‌ చేశారు. దీనితో పాటు ఈ సాలీడు గురించి రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. ప్రకృతి నైపుణ్యం నిజంగా అద్భుతమైనదని ఒకరు కామెంట్ చేయగా.. మరొకరు ఇలాంటి అద్భుత జీవులు ఇంకా ఈ ప్రపంచంలో నివసిస్తున్నాయంటే నేను నమ్మలేకపోతున్నానని చెప్పారు. ఇది AI అద్భుతం తప్ప మరొకటి కాదని మరొకరు వ్యాఖ్యానించారు.

మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..