Viral Video: ఇదేందయ్యా.. ఇది నేనేడా చూడలే… డ్రోన్ చేసిన పనికి అంతా షాక్!
ఇప్పుడంతా డ్రోన్స్ యుగం. ఎలాంటి కష్టమైన పనైనా డ్రోన్స్ టెక్నాలతో క్షణాల్లో పూర్తి చేస్తూ అద్భుతాలు సృష్టిస్తున్నారు. మనుషులు చేయలని పనులను కూడా డ్రోన్‌లు చాలా ఈజీగా చేసేస్తున్నాయి. అగ్రికల్చర్, షూటింగ్స్, పోలీసింగ్ వంటి పనులన్నీ డ్రోన్స్‌తో ఈజీగా అయిపోతున్నాయి. ఇక మరికొందరు...

ఇప్పుడంతా డ్రోన్స్ యుగం. ఎలాంటి కష్టమైన పనైనా డ్రోన్స్ టెక్నాలతో క్షణాల్లో పూర్తి చేస్తూ అద్భుతాలు సృష్టిస్తున్నారు. మనుషులు చేయలని పనులను కూడా డ్రోన్‌లు చాలా ఈజీగా చేసేస్తున్నాయి. అగ్రికల్చర్, షూటింగ్స్, పోలీసింగ్ వంటి పనులన్నీ డ్రోన్స్‌తో ఈజీగా అయిపోతున్నాయి. ఇక మరికొందరు డ్రోన్‌ను ఎలా వాడుతున్నారో చూస్తే షాక్ తినడం ఖాయం. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్న వీడియో ప్రకారం ఓ కార్యక్రమంలో యువకులు డ్రోన్‌తో వీడియోలు షూట్ చేస్తున్నారు. ఈ క్రమంలో వారు చేసిన ఓ పనిని చూసి అందరు నవ్వుకున్నారు. ఆ యువకులు అక్కడే ఉన్న ఓ మామిడి చెట్టు పైకి డ్రోన్‌ను పంపించారు. షూటింగ్‌ను వినూత్నంగా చిత్రీకరించేందుకు అలా చేస్తున్నారేమో.. అని అంతా భావించారు. అయితే తీరా చెట్టు పైకి వెళ్లిన డ్రోన్ రెక్కలతో మామిడి కాయను కోసేసింది. కాయను ఎంతో చాకచక్యంగా డ్రోన్ కత్తిరించడం చూసి అంతా షాక్ అయ్యారు. ఆ పండును కింద ఉన్న వ్యక్తి క్యాచ్ పట్టుకున్నాడు. డ్రోన్‌తో మామిడి కాయలను కోయొచ్చా అని అందరూ తెగ నవ్వుకున్నారు.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. డ్రోన్‌ను ఇలాక్కూడా వాడొచ్చని ఇప్పుడే తెలిసింది అంటూ కొందరు, డ్రోన్‌లను తయారు చేసింది ఇందుకా.. అంటూ మరికొందరు పోస్టులు పెడుతున్నారు.
వీడియో చూడండి:
View this post on Instagram