Viral Video: అమ్మో ఇలా ఎలా..! ఈ పాము వీడియో చూస్తే మీరు బెంబేలెత్తిపోవడం ఖాయం
పాములు తోకలపై నిల్చుంటాయని కొందరు చెబుతుంటే.. అదంతా బూటకమని కొట్టిపారేస్తారు చాలామంది. కానీ తాజాగా వైరల్ అయిన వీడియో చూస్తే అది నిజమే అని ఒప్పుకోవాల్సిందే. ఓ పాము తోకతో సమతుల్యం చేసుకుంటూ.. గోడపైకి పాకుతున్న అసాధారణ దృశ్యాన్ని చూసి నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు.

పాములు ప్రవర్తన ఒక్కోసారి చిత్రంగా ఉంటుంది. తోకపై నిల్చుని… నిలువుగా ఉన్న గోడలపై పాము పాకడం మీరెప్పుడునా చూశారా..? అలాంటి వీడియోను మీ ముందుకు తీసుకొచ్చాం. కొన్ని రకాల పాములు మాత్రమే గోడలపై పాకుతాయి. ముఖ్యంగా తోడేలు పాముల శరీర నిర్మాణం గోడలపై ఎక్కడానికి బాగా అనుకూలంగా ఉంటాయి. ఇవి సాధారణంగా రాత్రిపూట సంచరిస్తూ, బల్లులు, ఇతర చిన్న జంతువులను వేటాడతాయి. కొన్ని ఇతర పాములు కూడా గోడలపై పాకుతాయి, కానీ అవి తోడేలు పాముల మాదిరిగా బాగా ఎక్కలేకపోవచ్చు. గోడలపై పాకడం ద్వారా పాములు వేటాడేందుకు… నీరు, తేమ లభించే ప్రదేశాలకు వెళ్ళేందుకు ఉపయోగపడుతుంది.
తాజాగా ఓ భారీ పాము తోకపై నిల్చుని గోడపైకి ఎగబాకింది. ఈ వీడియో నెటిజన్లను ఆశ్చర్య చకితుల్ని చేస్తుంది. పాము ఇలా తోకతో సమతుల్యం చేసుకుంటూ గోడపైకి పాకుతున్న దృశ్యాన్ని తొలిసారి చూస్తున్నామని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే అది ఏ పాము అన్నది స్పష్టంగా తెలియడం లేదు. కోబ్రా అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram
నాగుపాము(కోబ్రా) తెలుగు రాష్ట్రాల్లో తరుచుగా కనిపిస్తూ ఉంటుంది. ఈ పాము పడగను విస్తరించి, భయపెడుతుంది. నాగుపాము విషం ప్రాణాంతకం. నాగుపాము విషం ఒక న్యూరోటాక్సిన్, అంటే అది నరాల వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. నాగుపాము ప్రధానంగా చిన్న పక్షులు, ఎలుకలను ఆహారంగా తీసుకుంటుంది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
