Viral Video: తెరపై సరికొత్త అల్పాహారం.. చాకోలెట్ పరాటా తయారీ.. తిట్ల దండకం అందుకున్న నెటిజన్లు..

భారతీయుల అల్పాహారాల్లో ఇడ్లి, దోశ, పరాటా, చపాతీ వంటివి ఉంటాయి. అయితే పరాటాను టిఫిన్ గానే కాదు లంచ్ గా కూడా తీసుకుంటారు. ఇది అన్ని వయసుల వారికి నచ్చుతుంది. ఇప్పుడు రకరకాల పరాటాలు మార్కెట్ లో లభిస్తున్నాయి. ఆలూ పరాటా, ఆనియన్ పరాటా వంటి అనేక రకాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఒక పరాటా తయారు చేసే విధానం ఉన్న వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

Viral Video: తెరపై సరికొత్త అల్పాహారం.. చాకోలెట్ పరాటా తయారీ.. తిట్ల దండకం అందుకున్న నెటిజన్లు..
Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Feb 10, 2024 | 1:11 PM

ఈ ప్రపంచంలో  భిన్నమైన ఆహారపదార్ధాలు.. విభిన్నమైన రుచులు.. అసలు ప్రపంచంలో భోజన ప్రియులకు కొదవలేదు.  సొషల్ మీడియా ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత వివిధ ప్రాంతాల్లోని ఆహారపు అలవాట్లు, ఆహార పదార్ధాల గురించి తెలుస్తోంది. తమకు నచ్చిన మెచ్చిన ఆహారాన్ని ట్రై చేయడానికి ప్రజలు ఇష్టపడుతున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకునే మార్గంగా మారింది. చాలా మంది వింత వింత ఆహార ప్రయోగాలు చేస్తూ పేరు తెచ్చుకుంటున్నారు. అయితే  ప్రతి ఆహార ప్రయోగం విజయవంతం కావాల్సిన అవసరం లేదు. గత కొంత కాలంగా నెట్టింట్లో రకరకాల వింత ఆహార పదార్ధాలు, ఆహార ప్రయోగాలు చక్కర్లు కొడుతున్నాయి. వీటిని చూసి భోజన ప్రియులు తలలు పట్టుకుంటున్నారు. తాజాగా ఒక ఆహారంపై ప్రయోగం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

భారతీయుల అల్పాహారాల్లో ఇడ్లి, దోశ, పరాటా, చపాతీ వంటివి ఉంటాయి. అయితే పరాటాను టిఫిన్ గానే కాదు లంచ్ గా కూడా తీసుకుంటారు. ఇది అన్ని వయసుల వారికి నచ్చుతుంది. ఇప్పుడు రకరకాల పరాటాలు మార్కెట్ లో లభిస్తున్నాయి. ఆలూ పరాటా, ఆనియన్ పరాటా వంటి అనేక రకాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఒక పరాటా తయారు చేసే విధానం ఉన్న వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇది చూసిన తర్వాత ఎవరైనా సరే ఖచ్చితంగా తల పట్టుకుంటారు. ఎందుకంటే చాక్లెట్ తో పరాటా తయారు చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

ఇక్కడ వీడియో చూడండి

ఒక యువకుడు మొదట చాక్లెట్‌ను తీసి.. ఒక ప్లేట్ వేశాడు. దానిని పేస్ట్ చేసి అందులో ఎండుద్రాక్ష, జీడిపప్పు ముక్కలను వేసి మిక్స్ చేసి పరాఠా స్టఫింగ్ కోసం రెడీ చేశాడు. తర్వాత పూరీ ముద్దను తీసుకుని చపాతీలా ఒత్తి.. దానిలో రెడీ చేసిన చాకోలెట్ స్టఫ్ ను పెట్టి పరాటాను రెడీ చేశాడు. తర్వాత పరాటాను పాన్‌పై ఉంచి, ఒక చెంచా నెయ్యి వేసి రెండు వైపులా కాల్చాడు. పరాటా పచ్చిగా లేకుండా కాల్చి  పరాటాను నాలుగు ముక్కలుగా చేశాడు. దానిని సర్వింగ్ కోసం ఒక ప్లేట్ లో పెట్టి.. బంగాళాదుంప కూరతో వినియోగదారులకు అందించాడు.

ఈ వీడియోను Xలో @Dharmeshpandey షేర్ చేసారు. ఇది చూసిన తర్వాత నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఒకరు ఇలా వ్రాశారు, ‘ఈ విధంగా పరాఠాను ఎవరు తయారు చేస్తారు సోదరా?’ మరొకరు, ‘దీనిని తయారు చేశారు.. అయితే ఎవరు తింటారు సోదరా?’ అని ఒకరు  ఈ వీడియోపై వ్యాఖ్యానించారు. ఈ వ్యక్తి అలాంటి పరాఠాలను తయారు చేయడానికి ప్రత్యేక కోర్సు తీసుకున్నాడు’ అని కామెంట్ చేశారు. అంతేకాదు చాలా మంది ఇతర వినియోగదారులు దీనిపై తమ అభిప్రాయాన్ని తెలిపారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..