Viral Video: ఎనుగుపై రియల్ ‘బాహుబలి’.. షోషల్ మీడియాను షేక్ చేస్తున్న అద్భుత వీడియో..!
Viral Video: టాలీవుడ్ యంగ్ రెబర్ స్టార్ ప్రభాస్ నటించిన సూపర్ హిట్ సినిమా బాహుబలి గురించి అందరికీ తెలిసిందే. బాహుబలి..
Viral Video: టాలీవుడ్ యంగ్ రెబర్ స్టార్ ప్రభాస్ నటించిన సూపర్ హిట్ సినిమా బాహుబలి గురించి అందరికీ తెలిసిందే. బాహుబలి 1, బాహుబలి 2 సినిమాలు యావత్ ప్రపంచంలోని సినీ ప్రేక్షకులను విపరీతంగా మెప్పించాయి. ఆ సినిమాలో ప్రతీ సీన్ ఒక అద్భుతమే. ప్రతీ సన్నివేశం ఇప్పటికీ కళ్లముందే కదలాడుతుంటాయి. ముఖ్యంగా బాహుబలి-2 లో సినిమా మొదట్లోనే ఏనుగు దాడి చేయడం, ప్రభావం ఎంట్రీ ఇచ్చి దానిని నియంత్రించడం సన్నివేశం అద్భుతం. ఆ తరువాత ఏనుగును తోండం సాయంతో ప్రభాస్ ఎక్కుతాడు. ఈ సీన్‌కు సంబంధించి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పటికీ వైరల్ అవుతుంటాయి. అంతలా జనాలను ఆకట్టుకుంది ఆ సన్నివేశం. అయితే, సేమ్ టు సేమ్ ఇలాంటి సన్నివేశం రియల్ లైఫ్‌లోనూ జరిగింది. అవును.. ఓ మావటి ఏనుగును తొండం ద్వారా ఎక్కాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఈ వీడియోలో ఏనుగు తొండంపై ఆ మావటి కాలు పెట్టగా.. ఆ ఏనుగు పైకి లేపుతుంది. అలా అతను దానిపైకి ఎక్కి దర్జాగా కూర్చుంటాడు. ఈ దృశ్యాన్ని ఫోన్ కెమెరాలో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు కొందరు. దాంతో వీడియో కాస్తా వైరల్ అయ్యింది. మావటి స్టైల్‌ను చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. రియల్ లైఫ్ బాహుబలి అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. బాహుబలి స్టైల్ అదరగొట్టాడు అంటూ పలువురు నెటిజన్లు కామెంట్ పెడుతున్నారు. ‘సినిమాలో గ్రాఫిక్స్ బాహుబలి ఉంటే.. ఇక్కడ నిజమైన బాహుబలి ఉన్నాడు.’ అని కామెంట్స్ పెట్టారు పలువురు నెటిజన్లు. ఈ వీడియో నెటిజన్లు విపరీతంగా ఆకట్టుకుంటుంది. మరెందుకు ఆలస్యం.. ఈ నిజమైన బాహుబలిపై మీరూ ఓ లుక్కేయండి.
He did it like @PrabhasRaju in #Baahubali2. @BaahubaliMovie @ssrajamouli pic.twitter.com/nCpTLYXp7g
— Dipanshu Kabra (@ipskabra) March 30, 2022
Also read:
Astro Tips: ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారా?.. యాలకులతో ఇలా చేస్తే డబ్బే డబ్బు..!
Banks Holidays: బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. ఏప్రిల్‌లో బ్యాంకులకు 15 రోజులు సెలవులు.. వివరాలివే..!
Big News Big Debate: 40 ఏళ్ల తెలుగుదేశం.. భవిష్యత్తుకు ఏది అభయం.. ప్రత్యేక కథనం..!