Viral Video: సింహాల మందకు సుస్సు పోయించిన ఏనుగు.. వీడియో చూస్తే గూస్‌బమ్స్ వచ్చేస్తాయి..!
Viral Video: భూమిపై కోట్లాది రకాల జీవ రాశులు మనుగడ సాగిస్తున్నాయి. ఒక్కో జీవిది ఒక్కో రకమైన జీవన విధానం. అయితే, భూమిపై ఉన్న జీవులన్నింటిలో ఎక్కువగా పరాన్న..

Viral Video: భూమిపై కోట్లాది రకాల జీవ రాశులు మనుగడ సాగిస్తున్నాయి. ఒక్కో జీవిది ఒక్కో రకమైన జీవన విధానం. అయితే, భూమిపై ఉన్న జీవులన్నింటిలో ఎక్కువగా పరాన్న జీవులే అధికం. ఇతర జీవులను తమకు ఆహారంగా చేసుకుని మనుగడ సాగించేవే అధికం. మనుషులమైన మనం.. చెట్లు, చేటలు, చిన్న చిన్న మూగ జీవాలను తిని బతుకుతున్నట్లే.. అడవిలోని జంతువులు కూడా ఇతర జంతువులను వేటాడి చంపి తిని తమ మనుగడ సాగిస్తున్నాయి. అలాంటి జంతువుల్లో క్రూర మృగాలైన సింహం, పులి, చిరుత పులి, మొసళ్లు తదితర జీవుల గురించి చెప్పుకోవచ్చు. సింహాలు, పులులు అడవిలో ఉండే చిన్న జంతువులను వేటాడి చంపి తినేస్తాయి. వాటి వేట అత్యంత భీకరంగా ఉంటుంది. అందుకే సింహాలు, పులులను చూసి అడవిలో ఉండే ఇతర జీవులు పీచే ముడ్ అంటూ పారిపోతాయి. అయితే, జంతువులు, వాటి వేట, వాటీ జీవన విధానానికి సంబంధించి సోషల్ మీడియాలో నిత్యం వేలాది వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అడవికి రాజు ఏంటి అంటే టక్కున సింహం అని చెబుతారు. అంతటి శక్తివంతమైనది కాబట్టి. అడవిలో తనకన్నా బలమైన, భారీ జంతువులు ఎన్ని ఉన్న సింహాల శక్తి ముందు బలాదూర్. అందుకే సింహాన్ని అడవికి రాజు అంటారు. తన కంటే వందల రెట్లు భారీ కాయం కలిగి ఉన్న ఏనుగును కూడా సింహం పడేయగలదు. కానీ, ఒక ఏనుగు మాత్రం సింహాన్ని కాదు.. సింహాల గుంపుకే చుక్కు చూచించింది. వేటాడేందుకు ప్రయత్నించిన సింహాల మందను.. వెంటాడి వెంటాడి తరిమింది. ఏనుగు దెబ్బకు సింహాల మంద పరుగో పరుగు అంటూ తోక ముడిచి పారిపోయాయి. ఈ వీడియోను లైఫ్ అండ్ నేచర్ పేరుతో ఉన్న ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేయగా.. అదికాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియో నెటిజన్లు విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఏనుగు ధైర్యాన్ని హ్యాట్సాఫ్ చెబుతున్నారు నెటిజన్లు.
— Life and nature (@afaf66551) March 28, 2022
Also read:
Kolkata Knight Riders vs Punjab Kings: రస్సెల్ దెబ్బ.. పంజాబ్ అబ్బా.. కోల్‌కతా అదిరిపోయే విక్టరీ.. !
April Fool’s Day: ఏప్రిల్‌లో ‘‘ఫూల్స్ డే’’ని ఎందుకు జరుపుకుంటాం.. దీని వెనుక ఉన్న అసలు కథ ఇదే..!
Hair Care Tips: అందమైన కురులు కావాలంటే రివర్స్ హెయిర్ వాష్ ట్రై చేయండి.. పూర్తి వివరాలివే..
