Viral Video: సింహంతో ఫన్నీ ట్రిక్.. క్షణాల్లో పిల్లిలా మారిపోయిన మృగరాజు.. షాకింగ్ వీడియో మీకోసం..!

Viral Video: సింహం, చిరుతపులి, పులి, ఇవన్నీ పిల్లి జాతికి చెందినవే. అయితే, మనుషుల మధ్య పెరిగే పిల్లికి, అడవిలో పెరిగే పులి, సింహాలకు

Viral Video: సింహంతో ఫన్నీ ట్రిక్.. క్షణాల్లో పిల్లిలా మారిపోయిన మృగరాజు.. షాకింగ్ వీడియో మీకోసం..!
Lion
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 09, 2022 | 8:30 AM

Viral Video: సింహం, చిరుతపులి, పులి, ఇవన్నీ పిల్లి జాతికి చెందినవే. అయితే, మనుషుల మధ్య పెరిగే పిల్లికి, అడవిలో పెరిగే పులి, సింహాలకు చాలా తేడా ఉంటుంది. పిల్లి మనం బెదిరిస్తే బెదిరి పారిపోతుంది. కానీ, అడవి మృగాలైన పులి, సింహాలను చూస్తే మనం పరుగులు తీయాల్సి వస్తుంది. లేదంటే.. వాటికి ఆహారం అయిపోయవాల్సి ఉంటుంది. అయితే, ఇంతటి క్రూర మృగమైన సింహంతో ఓ వ్యక్తి చాలా సరదాగా ఆటలాడుతున్నాడు. అదేదో పెంపుడు పిల్లి అయినట్లు.. చెట్టు కొమ్మతో రఫ్పాడించేస్తున్నాడు. సర్కర్‌లో జంతువులను ఆడించినట్లుగా.. అడవి సింహాన్ని ఓ ఆట ఆడుకున్నాడు ఆ వ్యక్తి. ఈ స్కిట్‌కు సంబంధించిన షాకింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఈ వైరల్ వీడియోలో.. అడవి రాజు సింహం ఒక పిల్లిలా మారిపోయాడు. అతను ఆడించినట్లు.. ఆడుతోంది. ఓ వ్యక్తి తన చేతిలో చెట్టు కొమ్మను పట్టుకుని సింహంతో సరదాగా ఆడుకుంటున్నాడు. చెట్టు కొమ్మ సహాయంతో దోబూచులాడుతున్నాడు. సింహం ఇటు వస్తే చెట్టు కొమ్మను అటు విసరడం, సింహం అటు వస్తే చెట్టు కొమ్మను ఇటు విసరడం చేస్తూ సరదాగా గడిపాడు. తన టెక్నిక్‌తో ఆ క్రూర మృగాన్ని ఒక తోలుబొమ్మను చేసి ఆడుకున్నాడు. అయితే, ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో @Yoda4ever పేరుతో ఉన్న అకౌంట్‌లో షేర్ చేశారు. నెటిజన్లు ఈ వీడియోను చూసి షాక్ అవుతున్నారు. దాదాపు 2 లక్షలకు పైగా వ్యూస్ వచ్చిన ఈ వీడియోపై నెటజిన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..