AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఫుడ్ ప్లేట్‌లో నోరు తెరిచిన చేప.. అవాక్కయిన కస్టమర్..

Viral Video: భారతదేశంలో ప్రజలు మాంసం, చేపలను కాల్చిన తర్వాత లేదా ఉడికించిన తర్వాత తింటారు. ముఖ్యంగా చేపలనైతే కోయకుండా, నూనెలో వేయించకుండా లేదా నిప్పులో

Viral Video: ఫుడ్ ప్లేట్‌లో నోరు తెరిచిన చేప.. అవాక్కయిన కస్టమర్..
Fish Suddenly Alive
uppula Raju
|

Updated on: Mar 30, 2022 | 11:10 AM

Share

Viral Video: భారతదేశంలో ప్రజలు మాంసం, చేపలను కాల్చిన తర్వాత లేదా ఉడికించిన తర్వాత తింటారు. ముఖ్యంగా చేపలనైతే కోయకుండా, నూనెలో వేయించకుండా లేదా నిప్పులో కాల్చకుండా ఎవరూ తినరు. మొదట చేపలని చంపి ఆ తర్వాత వాటిని వండుతారు. కానీ ప్రపంచంలో కొన్ని దేశాలలో ప్రజలు పచ్చి చేపలను కూడా తింటారు. విదేశాలలో అలాంటి హోటళ్ళు, రెస్టారెంట్లు చాలా ఉన్నాయి. ఇక్కడ ప్లేట్‌లో వివిధ రకాల చేపలు వడ్డిస్తారు. అందులో కొన్ని బతికున్న చేపలు కూడా వస్తాయి. తాజాగా ఒక కస్టమర్‌కి అలాగే జరిగింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అది చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. ప్లేటులో ఉంచిన ఒక చేప ఒక్కసారిగా నోరు విప్పడం ఈ వీడియోలో కనిపిస్తుంది. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో మీరు కొన్ని చేపలను ప్లేట్‌లో సలాడ్‌తో వడ్డించడాన్ని చూడవచ్చు. మొదట్లో చేప చచ్చిపోయినట్లు అనిపించినా ఫోర్క్‌తో కదిలించేసరికి అది బతికుంటుంది. అంతేకాదు చేప అకస్మాత్తుగా నోరు తెరిచి ఫోర్క్‌ని గట్టిగా పట్టుకుంటుంది. ఆ వ్యక్తి దాని నోటి నుంచి ఫోర్క్‌ని వదిలించడానికి ప్రయత్నిస్తాడు. కానీ చేప అస్సలు వదలదు. గట్టిగా పట్టుకోవడం మనం వీడియోలో గమనించవచ్చు. ఇలాంటి సంఘటనలు అరుదుగా జరుగుతుంటాయి. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఈ షాకింగ్ వీడియోని ఒక నెటిజన్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇప్పటి వరకు ఈ వీడియోని 92 వేల మందికి చూశారు. అంతేకాదు వేలాది మంది వీడియోను లైక్ చేసారు. ఈ వీడియో చూసిన తర్వాత ప్రజలు వివిధ రకాల రియాక్షన్‌లు ఇచ్చారు. ఒక నెటిజన్ ఆశ్చర్యకరమైన రీతిలో ‘ ఇదేంటి.. చేపలని పచ్చిగా కూడా తింటారా’ అని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. మరొక నెటిజన్ ‘సీఫుడ్ తినేవాళ్ళు రోజురోజుకు అధ్వాన్నంగా మారుతున్నారు’ అని రాశాడు. మీరు కూడా ఈ వీడియోని చూసినట్లయితే మీ కామెంట్‌ తెలియజేయండి.

Travel News: ప్రకృతి అందాలకు నెలవు ఈశాన్య భారతం.. సమ్మర్‌లో ఈ ప్రదేశాలు అస్సలు మిస్‌ కావొద్దు..!

Corona Kavach: సామాన్యులకి పెద్ద ఊరట.. ‘కరోనా కవచ్’ ఆరు నెలలు పొడగింపు..!

Aadhaar-Pan Link: ఈ వ్యక్తులకి ఆధార్-పాన్ లింక్‌ అవసరం లేదు.. మిగతా వారికి కచ్చితం..!