VIRAL VIDEO : ఘోరమైన యాక్సిడెంట్..! బైక్‌ని ఢీ కొట్టి.. కారు డ్రైవర్ ఎలా ఎస్కేప్ అవుతున్నాడో చూడండి..

VIRAL VIDEO : ప్రపంచంలో ప్రతిరోజూ అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ సంఘటనల వీడియోలు తెరపైకి వచ్చినప్పుడు

VIRAL VIDEO : ఘోరమైన యాక్సిడెంట్..! బైక్‌ని ఢీ కొట్టి.. కారు డ్రైవర్ ఎలా ఎస్కేప్ అవుతున్నాడో చూడండి..
Viral Video
Follow us
uppula Raju

|

Updated on: Jul 27, 2021 | 12:06 PM

VIRAL VIDEO : ప్రపంచంలో ప్రతిరోజూ అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ సంఘటనల వీడియోలు తెరపైకి వచ్చినప్పుడు మనసు కలిచివేస్తుంది. ఇటీవల వేగంగా వెళ్తున్న కారు ఇద్దరు బైక్ రైడర్‌లను ఢీకొట్టిన వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనలో బైక్‌ను ఢీకొట్టిన తర్వాత కారు డ్రైవర్ కొంచెం కూడా ఆగకుండా ఎస్కేప్ అవుతాడు. బైక్ పై నుంచి కింద పడిన వ్యక్తులు బతికున్నారా, చనిపోయారా అని చూడకుండా వెళ్లిపోతాడు. ఇది మానవత్వాన్ని ప్రశ్నించే విధంగా ఉంది.

ఇప్పుడు ఈ సంఘటన సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతోంది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో జరిగింది. సేలం జిల్లాలోని రహదారిపై కల్లకూరిచి నుంచి ఇద్దరు వ్యక్తులు వారి స్వగ్రామమైన పళనికి బైక్ పై వెళుతున్నారు. ఆ సమయంలో వేగంగా వెనుక నుంచి వచ్చిన కారు బైక్‌ని బలంగా ఢీ కొడుతుంది. దీంతో ఇద్దరు యువకులు రోడ్డు పక్కన కొంత దూరంలో ఎగిరిపడుతారు. బైక్ మొత్తం ధ్వంసం అవుతుంది. ఈ సంఘటన మొత్తం మరొక కారులో ఏర్పాటు చేసిన కెమెరాలో రికార్డ్ అయింది. వేగంగా వచ్చిన కారు మరో కారును ఓవర్ టేక్ చేయబోయి బైక్‌ని ఢీకొడుతుంది. ఇది స్పష్టంగా వీడియోలో కనిపిస్తుంది.

కారు ఢీకొన్న వెంటనే బైక్ ఎగిరిపడుతుంది దానిపై ప్రయాణిస్తున్న యువకులు ఇద్దరూ రోడ్డు మీద పడిపోతారు. ఈ యువకులలో ఒకరు మూర్ఛపోతారు. మరొకరు అతని వద్దకు వెళ్లి కిందపడిన వ్యక్తిని లేపడానికి ప్రయత్నిస్తారు. ఈ ప్రమాదం తరువాత అక్కడ ఉన్న బాటసారులు వారికి సహాయం చేయడానికి పరుగెత్తుతారు. ప్రజలు యువకులిద్దరిని సమీప ఆసుపత్రికి తీసుకెళ్తారు. ప్రస్తుతం ఈ విషయంపై పోలీసులు విచారణ చేస్తున్నారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారుతోంది.

అస్సాం-మిజోరం సరిహద్దుల్లో ఏం జరిగింది ? హోమ్ మంత్రి విద్వేష బీజాలు నాటుతున్నారన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ

Global Warming: ఏసీల వాడకం వల్ల పెరిగిపోతున్న గ్లోబల్ వార్మింగ్..ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని ఏసీలు ఉన్నాయో తెలుసా?

Follow Covid Norms:కరోనా తగ్గిందని ఆలయలకు వెళ్తున్నారా.. ప్లీజ్ ఇలా చెయ్యకండి..