AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: క్రికెట్ గ్రౌండ్‌లో దొంగ అలజడి.. ఆటగాళ్ల పర్సులపై కన్నేసిన చోరుడు.. ఇంతలో ఏమైందంటే?

క్రికెట్ గ్రౌండ్‌లోకి ఓ దొంగ ఎంటరయ్యాడు. మ్యాచులో ఆటగాళ్లంతా బిజీగా ఉన్నారు. పర్సులపై కన్నేసిన ఈ చోరుడు... క్షణాల్లో ఖాళీ చేసేసి తన పని పూర్తిచేశాడు. కానీ, ఇంతలో సీన్‌లోకి ఎంటరైన పోలీసులకు..

Viral News: క్రికెట్ గ్రౌండ్‌లో దొంగ అలజడి.. ఆటగాళ్ల పర్సులపై కన్నేసిన చోరుడు.. ఇంతలో ఏమైందంటే?
Cricket Viral Photo
Venkata Chari
|

Updated on: Jul 27, 2021 | 11:46 AM

Share

Viral News: క్రికెట్ గ్రౌండ్‌లోకి ఓ దొంగ ఎంటరయ్యాడు. మ్యాచులో ఆటగాళ్లంతా బిజీగా ఉన్నారు. పర్సులపై కన్నేసిన ఈ చోరుడు… క్షణాల్లో ఖాళీ చేసేసి తన పని పూర్తిచేశాడు. కానీ, ఇంతలో సీన్‌లోకి ఎంటరైన పోలీసులకు కూడా చుక్కలు చూపించి చివరికి పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. ఇంగ్లాండ్‌లో జరిగిన చెర్వెల్ లీగ్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ఈ సంఘటన జరిగింది. స్టాంటన్ హార్కోర్ట్ క్రికెట్ క్లబ్‌తో వుల్వర్‌కోట్ క్లబ్ తలపడుతోంది. మ్యాచ్ మంచి రసపట్టులో ఉంది. ఇంతలో గ్రౌండ్‌లోకి ఓ దొంగ ఎంటరయ్యాడు. మైదానంలోకి చొరబడి ఆటగాళ్ల పర్సుల నుంచి డబ్బును దొంగిలించడం మొదలు పెట్టాడు. ఈ వార్త క్రికెట్ ఆడుతున్న ఆటగాళ్లకు చేరింది. దీంతో వెంటనే వారు దొంగ కోసం వెతకడం ప్రారంభించారు.

ఆ దొంగ తెలివిగా తప్పించుకుని మైదానం దగ్గర ఒక బెంచ్‌పై జనాల మధ్యలో కూర్చున్నాడు. పిక్ పాకెటర్‌ను గమనించిన ఆటగాళ్లు.. అతని వద్దకు చేరుకుని, వివరాలు రాబట్టేందుకు ప్రయత్నించడం మొదలుపెట్టారు. వాళ్ళకు భయపడి పారిపోయేందుకు ప్రయత్నించాడు. దొంగ పారిపోతుండడంతో ఆటగాళ్లు వెంబడించడం ప్రారంభించారు. ఆటగాళ్లను ముప్పతిప్పలు పెట్టిన ఆ దొంగను పోలీసుల సహాయంతో పట్టుకోగలిగారు. మ్యాచ్ విషయానికి వస్తే.. స్టాంటన్ హార్కోర్ట్ క్రికెట్ క్లబ్ బౌలింగ్ చేస్తుంది. వుల్వర్‌కోట్ స్కోరు 6 వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. ఇంతలో దొంగ మైదానంలో అలజడి చేయడంతో ఆట రద్దైంది.

Also Read: Tokyo Olympics 2020 Live: స్పెయిన్‌పై 3-0 తేడాతో భారత హాకీ జట్టు విజయం.. రెండవ రౌండ్లో గురి తప్పిన మను-సౌరభ్ జోడీ

ఫీల్డింగ్‌లో ఇతన్ని ఢీ కొట్టేవారు లేరు.. ‘ఇండియా’ కు తండ్రయ్యాడు.. ఆ ప్లేయర్ ఎవరంటే.!

Tokyo Olympics 2020: హాకీలో టీమిండియా దూకుడు.. క్వార్టర్ ఫైనల్ ఆశలు సజీవం..!