Viral Video: ఈ పిల్లి మహా ముదురు.. నచ్చని టీవీ ఛానల్ పెడితే ఏం చేస్తుందో మీరే చూడండి..
Viral Video: పిల్లులను(Cats) ప్రేమించి.. వాటిని ఇష్టంగా పెంచుకునే వ్యక్తులకు .. పిల్లుల విలక్షణమైన ప్రవర్తన , వాటి లక్షణాల గురించి పూర్తిగా అవగాహన ఉంటుంది. పిల్లుల వీడియోలు ఎల్లప్పుడూ చూడడానికి ఆసక్తినిస్తాయి. అవి చాలా
Viral Video: పిల్లులను(Cats) ప్రేమించి.. వాటిని ఇష్టంగా పెంచుకునే వ్యక్తులకు .. పిల్లుల విలక్షణమైన ప్రవర్తన , వాటి లక్షణాల గురించి పూర్తిగా అవగాహన ఉంటుంది. పిల్లుల వీడియోలు ఎల్లప్పుడూ చూడడానికి ఆసక్తినిస్తాయి. అవి చాలా ఆనందాన్ని ఇస్తాయి. తాజాగా ఇన్‌స్టాగ్రామ్(Instagram)లో పోస్ట్ చేసిన పిల్లి వీడియో..ప్రస్తుతం నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తుంది. ఓ పిల్లి టీవీలో ఇతర పిల్లులను చూడటానికి..ఆసక్తిని చూపిస్తుంది.. అంతేకాదు.. ఛానల్ మార్చితే పిల్లి రియాక్షన్ చూస్తుంటే నవ్వొస్తుంది.
వీడియోలో.. మీలో అనే పిల్లి మంచం మీద హాయిగా విశ్రాంతి తీసుకుంటూ టీవీ చూస్తోంది. అయితే ఓ వ్యక్తి టీవీ ఛానల్ మార్చినప్పుడు.. పిల్లి వెంటనే టీవీ ముందుకు వెళ్లి నిలబడింది. అంతేకాదు టీవీ దగ్గరకు వెళ్లి.. తన యజమాని ఛానల్ ను మార్చాలని కొంచెం సేపు వేచి చూసింది. అయితే కొంచెం సేపు అలా పిల్లి ఛానల్ ను మార్చడం కోసం చూసి.. ఎంత సేపు అయినా టీవీ ఛానల్ ను మార్చకపోవడంతో.. అసహనంతో పిల్లి చివరికి టీవీ వెనుకకు వెళ్లి స్విచ్ ఆఫ్ చేసింది. “నేను ఏమి చేశానో నాకు తెలుసు అన్నట్లు.. ఆ పిల్లి చివరిలో తన యజమానివైపు చూస్తున్నట్లు వీడియోలోని టెక్స్ట్ ద్వారా తెలుస్తోంది. ఈ వీడియోకి పిల్లి ఇంటిని నడుపుతుంది అనే శీర్షికతో షేర్ చేశారు. ఈ వీడియో జనవరి 30న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయబడింది. ఇప్పటివరకు నాలుగు లక్షల మంది వీక్షించారు.”
పిల్లి మీకు హెచ్చరిక చేసింది… అయినా పట్టించుకోలేదు.. దీంతో కఠినమైన చర్యలు తీసుకోవలసి వచ్చింది” అని ఒక ఇన్ స్టాగ్రామ్ వినియోగదారుడు వ్యాఖ్యానించాడు. మరొకతను.. “మీరుపిల్లి ఇంట్లో నివసిస్తున్నారు” అని నవ్వుతున్న ఎమోజీల కామెంట్ చేశారు. ఈ పిల్లి ఒహియోలో నివసిస్తుందని ఇన్ స్టాగ్రామ్ ద్వారా తెలుస్తోంది. ఇప్పటికే ఈ మీలో పిల్లి పేజీకి 87,000 కంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు.
View this post on Instagram
Also Read: